54ఏళ్ల వయసులో 25ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ను పెళ్లాడుతున్నాడు
ప్రపంచ ప్రఖ్యాత పుట్బాల్ ఆటగాడు, అర్జెంటీనా మాజీ కెప్టెన్ డీగో మారడోనా త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన మాజీ ప్రియురాలా రొకియో ఒలివాను మరాడోనా పెళ్లాడనున్నాడు. ఈ విషయాన్ని ఒలివానే స్వయంగా వెల్లడించింది.
ఒలివా సోదరుని పుట్టినరోజు పండుగకు ఇటీవలే అర్జెంటీనాకు వచ్చిన ఒలివాను మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 13న మీరు పెళ్లి చేసుకుంటున్నారా? అని ప్రశ్నించగా ఈ ఏడాదిలోనే తమ పెళ్లి ఉంటుందని, అయితే డేట్ ఫిక్స్ చేయలేదని తెలిపింది.

అయితే వీరి పెళ్లి వాటికన్ సిటీలో పోప్ సమక్షంలో జరగనుందనే వార్తలు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. బినోస్ ఐరిస్లో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ పుట్ బాల్కు వీరాభిమాని. సెలబ్రిటీ గాసిప్స్ ప్రోగ్రామ్స్ ప్రకారం మారడోనా వయసు 54 కాగా, ప్రియురాలు ఒలివా వయసు 25 సంవత్సరాలు.
2003లో తన భార్య క్లౌడియాకు మారడోనా విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. జాయింట్ అకౌంట్కు సంబంధించి ఆర్ధిక లావాదేవీల్లో పేచీ రావడంతో మారడోనా మాజీ భార్య క్లౌడియా కోర్టుని ఆశ్రయించింది. మరో ముగ్గురు మహిళల ద్వారా మారడోనాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.