వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో జుకర్‌బర్గ్: ప్రొఫైల్ పొరపాటు, నెటిజన్ల ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో గత రెండు, మూడు రోజులుగా భారతీయ త్రివర్ణ పతాకం నేపథ్యంతో ప్రొఫెల్ పిక్చర్ మార్చుకోవడం ఊపందుకుంది. అయితే ఈ ప్రొఫైల్ పిక్చర్ అంశంపై వివాదంగా రాజుకున్నది.

ఈ నేపథ్యంలో డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు తెలిపినంత మాత్రాన వివాదాస్పద ఇంటర్నెట్.ఓఆర్జీని ప్రోత్సహించినట్లు కాదని, వెంటనే ఆ కోడ్‌ను మార్చివేస్తామని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పేర్కొంది.

భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న నేపథ్యంలో డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్లు భారత మూడు రంగుల జెండాతో ఉన్న చిత్రాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ మార్క్ జుకర్ బర్గ్ తన ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నాడు.

 Digital India profile tool not linked to support for Internet.org: Facebook

అంతేకాకుండా దీనిని పోత్సహించేందుకు నెటిజన్లకు ఫేస్‌బుక్ ఓ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివాదాస్పద ఇంటర్నెట్.ఓఆర్జీకి కనెక్ట్ అయ్యే విధంగా డిజిటల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ ఉండటంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ టూల్ ద్వారా ఫ్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకుంటే ఫేస్‌బుక్ పర్యవేక్షణలో నడిచే ఇంటర్నెట్.ఓఆర్జీకి మద్దతు తెలిపినట్లేనని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఫేస్‌బుక్ దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది.

ఓ టెక్నీషియన్ చేసిన తప్పు కారణంగా ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. ఇంటర్నెట్.ఓఆర్జీ ప్రొఫైల్ పిక్చర్ అనే పదాలను ఇంజినీర్ పొరపాటుగా చేర్చాడని వివరణ ఇచ్చింది. ఈ గందరగోళాన్ని నివారించేందుకు మంగళవారం కోడ్‌లో మార్పులు చేసి, ఆ పదాలను తొలగిస్తున్నట్లు చెప్పింది.

English summary
Digital India profile tool not linked to support for Internet.org: Facebook
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X