వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లిబియాలో ఘోర ప్రమాదం: రెండు పడవలు బోల్తా, 170 మంది గల్లంతు
లిబియా: మధ్యధరా సముద్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగాయి. దీంతో 170 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. లిబియా తీరంలో శనివారం ఓ పడవ మునిగి పోయినట్లు ఇటలీ నావికాదళం వెల్లడించింది.
ఇందులో దాదాపు 117 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో పది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఒక శిశువు ఉన్నారు. ఈ పడవ లిబియాలోని గారాబుల్లి రేవు నుంచి ప్రయాణం ప్రారంభించిన పది గంటల్లో మునిగిపోయినట్లు తెలిపారు.

మరో పడవ మొరాకో నుంచి బయలుదేరి మధ్యధరా సముద్రానికి పశ్చిమాన అలబోరన్ సముద్రంలో మునిగింది. ఈ పడవలో యాభై మందికి పైగా ఉన్నారు. ఈ పడవ నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం ఇటలీ నావికాదళం గాలింపు చర్యలు చేపట్టింది.