• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రన్‌వేపై విమానంలో విందు: ఒక్క భోజనం 40 వేల రూపాయలు..

By BBC News తెలుగు
|

ఆహారం

ఒక్క మీల్ ధర 40 వేల రూపాయలు.

ఇది చాలా స్పెషల్. అందుకే అంత రేటు.

జపాన్‌లో ఒకే ఒక్క చోట మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తోంది.

ఇంత రేటు పెట్టినప్పటికీ ఈ భోజనం టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అయిపోయాయని ఆ కంపెనీ చెబుతోంది. దాంతో ఏప్రిల్ నెల కోసం మరిన్ని స్లాట్లు ఆఫర్ చేస్తోంది..

ఒక్క భోజనానికి ఎందుకింత ధర

ఈ భోజనం తినాల్సింది హోటల్లోనో.. రెస్టారెంట్లోనో కాదు. విమానంలో.

గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాదు.. రన్‌ వేపై ఆగి ఉన్న విమానంలో మీకు ఈ భోజనం వడ్డిస్తారు.

అంటే విమానం తాత్కాలిక రెస్టారెంట్‌గా మారిపోతుందన్నమాట.

జపాన్‌కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ సంస్థ గత బుధవారం ఈ సర్వీస్ ప్రారంభించింది.

కొద్దిసేపట్లోనే టికెట్లు అన్ని బుక్ అయిపోయాయి.

దాంతో అదనపు స్లాట్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఈ కంపెనీకి.

జపాన్‌లో ఏఎన్ఏ అతిపెద్ద విమానయాన సంస్థ.

ఇంధనం నింపుకొంటున్న విమానం, గాల్లో ఎగురుతున్న మరో విమానం

ఇలా ఎందుకు చేస్తోంది..

కరోనా వైరస్ కారణంగా జపాన్‌లో విమాన సేవలు చాలావరకు నిలిచిపోయాయి. అవి ఎయిర్‌ పోర్టుల్లో ఖాళీగా పడి ఉన్నాయి.

ఇలా వృథాగా పడున్న విమానాలను ఉపయోగించుకునేందుకు క్రియేటివ్‌గా ఆలోచించారు.

రన్‌వేపై నిలిపి ఉంచిన విమానంలో ఫస్ట్ క్లాస్ భోజనం చేయొచ్చని ఆఫర్ పెట్టారు.

ఒక్క మీల్ ధర దాదాపు 40 వేల రూపాయలుగా నిర్ణయించారు.

ఇంత భారీ ధర పెట్టినప్పటికీ డిమాండ్ అధికంగానే ఉందని చెబుతోంది కంపెనీ

విమానం

ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్, కోవిడ్ నిబంధనల కారణంగా ప్రపంచ విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయాయి.

ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు, ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు కొన్ని సంస్థలు క్రియేటివ్‌గా ఆలోచించి ఇలా విమానాల్లో భోజనం చేసే అవకాశం కల్పిస్తున్నాయి.

అక్టోబర్‌లో సింగపూర్ ఎయిర్‌‌లైన్స్‌.. ప్రధాన ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచిన ఎయిర్‌బస్‌ ఏ380లో లంచ్ చేసే అవకాశం కల్పించింది.

జపాన్‌కు చెందిన ఏఎన్ఏ, బోయింగ్ 777లో భోజనం చేసే అవకాశం కల్పిస్తోంది.

టికెట్లు కొన్నవాళ్లు టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టులో పార్క్ చేసున్న విమానంలో భోజనం చేయొచ్చు.

ఫస్ట్ క్లాస్ సీట్‌ డైనింగ్ రేటు 59800 యేన్లు కాగా.. బిజినెస్ క్లాస్ లంచ్ కోసం 29800 యేన్లు చెల్లించాల్సి ఉంటుంది.

భారత కరెన్సీలో చెప్పాలంటే.. ఫస్ట్ క్లాస్ డైనింగ్ దాదాపు 40వేలు.. బిజినెస్ క్లాస్ లంచ్ సుమారు 20 వేల రూపాయలు.

ఆహారం

ఆస్ట్రేలియా మాత్రం విమానాలను మళ్లీ నడిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

దేశీయ విమాన ప్రయాణాలను ప్రోత్సహించేందుకు విమాన యాన సంస్థలకు 1.2 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.

ప్రజలు దేశీయ విమానాల్లో ప్రయాణించేలా ప్రోత్సహించడానికి ఈ మనీ ఖర్చుచేస్తారు.

ఈ ప్యాకేజీతో దాదాపు ఎనిమిది లక్షల టికెట్ల ధరలు సగానికి సగం తగ్గుతాయి. ధరలు తగ్గితే జనం మళ్లీ విమానాలు ఎక్కుతారని ఆశిస్తోంది.

ఈ టికెట్లు జూన్ వరకు బుక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dinner on the plane on the runway: one meal 40 thousand rupees ..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X