• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దారుణం: భారత సంతతి క్రికెటర్ తల నరికివేత

|

జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలో ఉంటున్న భారత సంతతికి చెందిన మానసిక వికలాంగుడైన క్రికెటర్‌ను అతడికి సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు తల నరికి నరబలి ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు అతడి ప్రాణస్నేహితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. భారత సంతతికి చెందిన నవాజ్ ఖాన్(23) అనే మానసిక వికలాంగ క్రికెటర్‌ను అతడి ప్రాణ స్నేహితుడు తండోవాఖే డుమా(21) తన ఇంటికి సమీపంలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లాడు. అతడు నాటువైద్యాలు చేస్తుంటాడు. ఆ అడవిలోనే నవాజ్ ఖాన్‌పై కత్తులతో దాడిచేసి తల నరికేశాడు.

తనకు కొన్ని సమస్యలున్నాయని, వాటి నుంచి బయటపడాలంటే మనిషి తల తీసుకురావాల్సిందిగా మరో భూత వైద్యుడు చెప్పాడని, అందుకే తాను స్నేహితుడిని బలిచ్చానని నిందితుడు డుమా పోలీసుల విచారణలో అంగీకరించాడు. అతడే ఘటనా స్థలాన్ని చూపించాడు. నిందితుడ్ని పట్టుకోవడంలో స్థానికులు చొరవ చూపారని పోలీసులు తెలిపారు.

 Disabled Indian-origin cricketer beheaded in South Africa

ఖాన్‌ను చంపి, అతడి మొబైల్ ఫోన్లను తమ వద్ద ఉంచుకున్న మరో ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. దక్షిణాఫ్రికాలో మానసిక వికలాంగ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2013 అవార్డును కూడా నవాజ్ ఖాన్ గెలుచుకున్నాడని అతడి తల్లి జకియా ఖాన్ చెప్పారు.

తాను ఎంతగానో అభిమానించే హషీమ్ ఆమ్లా నుంచి ఈ అవార్డు అందుకుని చాలా సంబరపడిపోయాడని, అది తన జీవితంలోనే అత్యంత మధుర క్షణమని చెప్పేవాడని ఆమె చెప్పారు.

కాగా, త్వరలో ఖాన్ తన బృందంతో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, ఇంతలో ఈ దారుణం జరగడం విచారకరమని దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి అల్బర్ట్ వార్నిక్ తెలిపారు. ఖాన్ చాలా ప్రతిభగల బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ అని, అతడు చాలా మంది కొత్త ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉండేవాడని మాజీ జాతీయ క్రికెట్ కన్వీనర్ విన్‌స్టన్‌ స్టబ్స్ పేర్కొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a brutal incident, a young promising South African Indian intellectually-impaired cricketer has been beheaded in a ritual sacrifice, prompting police to start a probe and arrest three persons including his best friend in connection with the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more