• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రకృతి విపత్తులు: చెదురుతున్న గూళ్లు, వలస బాటలు

By Swetha Basvababu
|

న్యూయార్క్: వరదలు, తుఫాన్లు, కుల, మత, జాతి ఘర్షణల వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది నిర్వాసితులవుతున్నారు. అందులో ఉన్న వారిలో భారతీయుల సంఖ్యేమీ తక్కువ లేదు. చైనా, ఫిలిప్పీన్ తర్వాత మనదేశమే ఉన్నది. గత ఏడాది అన్నీ కోల్పోయి.. పొట్ట చేతపట్టుకొని.. భారత్‌లో నిర్వాసితులైన 28 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో సాధిస్తున్న అభివృద్ధి ఆర్థిక అంతరాలను తొలగించలేకపోతున్నదని నార్వే నిర్వాసితుల మండలిలోని అంతర్గత స్థాన చలన పరిశీలన కేంద్రం తెలిపింది.

ప్రకృతి విపత్తులు, మానవ సంక్షోభాల కారణంగా గత ఏడాది భారతదేశంలో 28 లక్షల మంది ప్రజలు తమ నివాసప్రాంతాలను కోల్పోయారు. పొట్టచేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. తుఫాన్లు, వరదలు వంటి విపత్తులతోపాటు కుల, మత, జాతి పరమైన ఘర్షణలు ఈ తీవ్రమైన సమస్యకు కారణమవుతున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో భారీఎత్తున జరిగిన స్థానచలనాలు, దానికి దారితీసిన పరిస్థితులను ఈ నివేదిక వివరించింది. స్థానచలనానికి గురైన ప్రజలు అత్యధికసంఖ్యలో చైనాలో ఉండగా, ఆ తర్వాత ఫిలిప్పీన్స్, భారత్ 2వ, 3వ స్థానాల్లో నిలిచాయి.

 Disasters leads to migration people safer places, Says Narway Survey

భారతదేశంలో ఇదీ పరిస్థితి

ఘర్షణ, హింస తదితర కారణాలతో 4.48 లక్షల మంది, ప్రకృతి విపత్తుల కారణంగా 24 లక్షల మంది నిర్వాసితులయ్యారు. వీరి మొత్తం సంఖ్య 28.48 లక్షలు. స్థానచలనానికి ప్రకృతి విపత్తుల్లో వరదలు, తుఫాన్లు ముఖ్య కారణాలు. భారతదేశంలో 68 శాతం భూభాగం కరువుకు గురైతే, 60 శాతం భూభాగం భూకంపాలకు, 75 శాతం తీరప్రాంతం తుఫాన్లు, సునామీలకు గురయ్యే ప్రమాదాన్ని కలిగి ఉంది.

మతం, కులం, జాతి, గుర్తింపునకు సంబంధించిన అంశాలతో మనదేశంలో ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇవి హింసాత్మక, వేర్పాటువాద ఉద్యమాలుగా మారుతున్నాయి. ఆర్థికరంగంలో భారత్ సాధిస్తున్న గణనీయమైన అభివృద్ధిగానీ, సామాజిక రక్షణ వ్యవస్థను మెరుగుపర్చేందుకు జరిపిన ప్రయత్నాలుగానీ ఆర్థిక అంతరాలను, పట్టణ-గ్రామీణ అంతరాలను తొలగించలేకపోయాయి.

జనాభా, ప్రగతి ఫలాలు అందక ఘర్షణలు

విపరీతమైన జనాభా పెరుగుదల, దేశ ఆర్థికాభివృద్ధితో పేదలకు లబ్ధి చేకూరని పరిస్థితులు కలగలిసి.. భూమి తదితర వనరుల విషయంలో జాతి, మతపరమైన ఘర్షణలు తలెత్తుతున్నాయి. జమ్మూకశ్మీర్, ఈశాన్యరాష్ర్టాల్లో అమల్లో ఉన్న సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టం కారణంగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు వలస రావడంతో నాగాలాండ్, అసోంలలో వేర్పాటువాద హింసాత్మక ఉద్యమాలు, తెలంగాణ తదితర ప్రాంతాల్లో జరిగిన, జరుగుతున్న గుర్తింపు ఆధారిత ఉద్యమాలు, గుజరాత్‌లో చెలరేగిన మతహింస, బీహార్, యూపీల్లో కులవివాదాలు.. పెద్దసంఖ్యలో ప్రజల స్థానచలనానికి కారణమవుతున్నాయి.

 Disasters leads to migration people safer places, Says Narway Survey

దక్షిణాసియాలో భారత్‌లోనే ఎక్కువ

జనసాంద్రత అధికంగా ఉన్న దేశం భారత్. దేశజనాభాలో మూడోవంతు మంది పేదరికంలో, నాసిరకం ఇండ్లలో, సులభంగా విపత్తులకు గురయ్యే ప్రాంతాల్లో, పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రజలు స్థానభ్రంశానికి గురయ్యే ప్రమాదం యావత్ దక్షిణాసియాలో భారత్‌లోనే ఎక్కువగా ఉన్నది.

ప్రగతి మాటున అంతులేని దుఃఖం

సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ పేరుతో పెద్ద ఎత్తున జరిగే భూసేకరణ వల్ల కూడా గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని లక్షల మంది ప్రజలు తమ నివాసప్రాంతాలను కోల్పోయి కొత్తప్రాంతాలకు వలస వెళ్లారు. 1984లో ప్రారంభమై 2015లో ముగిసిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణంతో గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో 3.5 లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు.

English summary
Natural disasters are leads to lakhs of the people to migrate safer places while india placed in 3rd place. Top of migrations China here and second place in Philippines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X