వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: చైనాకు పాకిస్తాన్ ఝలక్ -డ్రాగన్‌ను కాదని సీరం తయారీ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు అనుమతి

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాల నుంచి తిరస్కరణలు ఎదురవుతున్నా.. సైనిక, ఆర్థిక రంగాల్లో తనకు సహకరిస్తోన్న చైనాకు పాకిస్తాన్ గట్టి ఝలకిచ్చింది. కరోనా మహమ్మారి నియంత్రణకు సంబంధించి చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేస్తామని నెల రోజుల కిందటే ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. దాని కంటే ముందుగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ వాడకానికి అనుమతిచ్చింది.

కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్

బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి పాకిస్తాన్ అనుమతిచ్చింది. ''కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా అత్యవసరంగా వాడటానికిగానూ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ పాకిస్తాన్ (డ్రాప్) అనుమతి మంజూరు చేసినట్లు ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు డాక్టర్ ఫైసల్ సుల్తాన్ మీడియాకు తెలిపారు.

 dispite chinese sinopharm, Pakistan approves Oxford-AstraZeneca COVID-19 vaccine

మార్చి నాటికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని, నుంచి కరోనాను తరిమేస్తామని, మొదటి దశలో టీకాలను ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్లు పైబడినవారికి అందజేస్తామని, నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్స్ సెంటర్ (ఎన్‌సిఓసి) చీఫ్, ప్రణాళిక మంత్రి అసద్ ఉమర్ తెలిపారు. కాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను భారత్ లో సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పాకిస్తాన్ ఈ వ్యాక్సిన్ ను నేరుగా భారత్ నుంచి కొనుగోలు చేస్తుందా, బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక..

మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తిమోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తి

పాకిస్తాన్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,521 కేసులు, 43 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,19,291కు, మరణాల సంఖ్య 10,951 కు చేరుకున్నాయని జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాక్సిన్ కు సంబంధించి ఆస్ట్రాజెనెకాతోపాటు చైనా, ఇతర దేశాల సంస్థలతోనూ సంప్రదింపులుజరుపుతున్నట్లు పాక్ అధికారులు చెప్పారు. చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్ క్లినికలం ట్రయల్స్ ఫలితాలు వచ్చాక ఆమోదించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

English summary
Pakistan has approved the emergency use of Oxford-AstraZeneca COVID-19 vaccine and the government hopes to make the drug available by the first quarter of the year, as the country's coronavirus tally surged to 519,291. earlier Pakistan had announced that it will purchase 1.2 million COVID-19 vaccine doses from China's Sinopharm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X