• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహిళ గొంతులో 4 అడుగుల పాము - నోరు తెరిచి నిద్రపోతే అంతే మరి - వైరల్ వీడియో

|

చిన్నపిల్లలు ఎవరికైనా చెవిలో చిన్న పురుగు దూరితే.. ఇల్లంతా గడగడలాడే దృశ్యాలు మనలో చాలా మందికి అనుభవమే. తెలిసిన చిట్కాలతోనో, హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లడంతోనో అప్పటికప్పుడు పురుగును వెలికితీయనిదే ఎవరికీ నిద్రపట్టదు. అయితే, ఈ సంఘటన మాత్రం కొంచెం డిఫరెంట్, ఇంకాస్త భయానకం కూడా.

  COVID-19 : ‘కరోనా వ్యాక్సిన్’ డేటా ను Russia దొంగతనం చేసిందా ? || Oneindia Teludu
  అదో పర్వత ప్రాంతం..

  అదో పర్వత ప్రాంతం..

  వైద్యపరంగా కారణాలు ఏవైనప్పటికీ, మనుషుల్లో కొందరికి నోరు తెరిచి నిద్రపోవడం అలవాటు. అదిగో, ఆ అసంకల్పిత అలవాటే ఆమెను ప్రమాదంలో పడేసింది. రష్యా ఉత్తర భాగంలోని డజెస్థాన్‌ ఫ్రావిన్స్ పర్వతాలకు పెట్టిందిపేరు. అక్కడి లెవాషి గ్రామానికి చెందిన ఓ మహిళ నోరు తెరిచి గాఢంగా నిద్రపోతున్న సమయంలో ఆమె గొంతులోకి సన్నటి పాము దూరింది.

  స్కానింగ్ చేస్తే..

  నిద్ర లేచిన తర్వాత కడుపులో వికారం, గొంతులో ఏదో అడ్డు తగిలినట్లు అనిపించడంతో ఆ మహిళ స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్య సిబ్బంది ఆమె శరీరాన్ని స్కాన్ చేయగా.. మెలికలు తిరిగిన పొడవాటి జీవి లాంటిదేదో కనిపించింది. హుటాహుటిన ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లి.. ఆధునిక వైద్య సాధనాలతో ఆ జీవిని బయటికి తీసే ప్రయత్నం చేశారు..

  వైరల్ వీడియో..

  వైరల్ వీడియో..

  కనిపించగానే అది పామేనని నిర్ధారణ చేసుకున్న వైద్య సిబ్బంది.. దాన్ని పట్టుకుని పైకి లాగుతోంటే, అంతకంతకూ సాగుతూ వచ్చింది. మహిళ గొంతులో నుంచి తీసిన పాము పొడవు ఏకంగా 4 అడుగులు ఉందని డాక్టర్లు చెప్పారు. అరుదైన ఈ ఆపరేషన్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పామును వెలికి తీసిన తర్వాత మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది గంటల అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా,

  అక్కడివి మామూలే..

  అక్కడివి మామూలే..

  బాధిత మహిళ ఉంటోన్న లెవాషి గ్రామంలో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణమేనని ప్రఖ్యాత ‘డెయిలీ మెయిల్' చెబుతోంది. పర్వతప్రాంతమైన డజెస్థాన్‌.. రష్యాలో బాగా ప్రాచుర్యంపొందిన టూరిస్ట్ ప్లేస్. అక్కడి లెవాషి గ్రామం.. సముద్ర మట్టానికి 4,165 అడుగుల ఎత్తులో ఉంటుంది. మహిళ గొంతులో నుంచి పామును తీస్తోన్న వీడియో వైరల్ గా మారింది.

  English summary
  A video has said to have come from Russia which has the internet absolutely terrified and creeped out. The video shows a '4-feet-long' snake is being pulled out of a woman's mouth. The woman is unconscious in the hospital while the doctors perform an operation to pull out the object from inside her mouth. Just then, a long creature is pulled out and within second, the staff realized that it none other than the reptile that must have been in her body.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X