• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూలియన్ అసాంజేకు చికిత్స చేయకుంటే జైలులోనే చనిపోతాడు: డాక్టర్లు

|

లండన్: వికిలీక్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడమే కాదు అగ్రరాజ్యం అమెరికాను వనికించిన ఆ సంస్థ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఆరోగ్య పరిస్థితి చాలా బాగాలేదని అతన్ని పరీక్షించిన 60 మంది వైద్యులు చెబుతున్నారు. ఇలానే అసాంజేను జైలు గోడలకే పరిమితం చేస్తే అతని ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు బహిరంగ లేఖను విడుదల చేశారు.

బ్రిటన్ జైలులో జూలియన్ అసాంజే

బ్రిటన్ జైలులో జూలియన్ అసాంజే

జూలియన్ అసాంజే... వికీలీక్స్ వ్యవస్థాపకులు. అగ్రరాజ్యం అమెరికానే తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్‌తో గడగడలాడించాడు. అమెరికా రహస్యాలు బయటపెట్టడమే కాకుండా గూఢచర్య చేశారని అతనిపై గుర్రుగా ఉంది ఆదేశం. ప్రస్తుతం అసాంజే అత్యాచార ఆరోపణలపై బ్రిటీషు జైలులో శిక్ష పొందుతున్నారు. అమెరికా మాత్రం అసాంజేను తమ దేశానికి రప్పించుకునే విషయమై ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవేళ అదే జరిగితే అసాంజేకు అమెరికాలో 175ఏళ్లు జైలు శిక్ష పడనుంది.

అసాంజే ఆరోగ్యంపై వైద్యులు బహిరంగ లేఖ

అసాంజే ఆరోగ్యంపై వైద్యులు బహిరంగ లేఖ

ప్రస్తుతం హైసెక్యూరిటీ ఉన్న బెల్‌మార్ష్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు అసాంజే. అయితే అసాంజేను వెంటనే చికిత్స కోసం ఓ మెడికల్ కాలేజీకి తరలించాలని వైద్యులు బహిరంగలేఖ రాయడంతో బ్రిటన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి హోమ్‌ సెక్రటరీ ప్రీతి పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్ 21న కోర్టుకు హాజరైనప్పుడు అసాంజే పరిస్థితిని వైద్యులు అంచనా వేశారు. ఇక అసాంజేను అలానే వదిలేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదమని ఐక్యరాజ్యసమితి స్వతంత్ర హక్కుల నిపుణులు చెప్పారు. ఇక అసాంజే ఆరోగ్యంపై 16 పేజీలతో కూడిన బహిరంగ లేఖను వైద్యులు రాశారు .

 ఇలా వదిలేస్తే ఫిబ్రవరి వరకు కూడా బతకడం కష్టమే

ఇలా వదిలేస్తే ఫిబ్రవరి వరకు కూడా బతకడం కష్టమే

అసాంజేకు శారీరక పరిస్థితితో పాటు మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరిలో అమెరికాకు రప్పించే విషయమై వాదనలు జరగనుండగా అప్పటి లోగా అసాంజే ఆరోగ్యం మరింత విషమించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఇప్పుడు కనుక మానసిక వ్యాధికి సంబంధించిన చికిత్స, శారీరక వ్యాధులకు సంబంధించిన చికిత్స అందించకుంటే అసాంజే జైలులోనే మృతి చెందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అత్యవసర చికిత్స అసాంజేకు అందజేయాలని సమయంను వృథా చేయకూడదని వైద్యులు చెప్పారు.

 మానసికంగా శారీరకంగా నలిగిపోయిన అసాంజే

మానసికంగా శారీరకంగా నలిగిపోయిన అసాంజే

ఆరు నెలల తర్వాత తొలిసారిగా కోర్టుకు హాజరైన అసాంజేను చూసిన వైద్యులు ఆయన చాలా బలహీనంగా ఉన్నాడని చెప్పారు. అంతేకాదు కోర్టు అడిగే ప్రశ్నలకు అసాంజే ఇచ్చిన సమాధానాలు చూస్తే మానసికంగా కూడా చాలా బలహీనంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోర్టు తన పుట్టిన రోజు ఎప్పుడని అడుగగా ఆ తేదీ కూడా మరిచిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఇక వాదనలు ముగిశాక కోర్టులో ఏం జరిగిందని అసాంజే జడ్జిని అడిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజే ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకోగా గత ఏప్రిల్‌లో ఆయన్ను లాక్కొచ్చి బ్రిటీషు జైలులో ఉంచారు.

English summary
More than 60 doctors wrote an open letter published Monday saying they feared Julian Assange’s health was so bad that the WikiLeaks founder could die inside a top-security British jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X