వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి ద్వారా కరోనా వస్తుందా ? .. పరిశోధనల్లో వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలు

|
Google Oneindia TeluguNews

చైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి తన ప్రభావాన్ని చాటుతుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో వణుకుతుంది. ప్రస్తుతం ఎవరి నోట విన్నా కరోనా అన్న మాటే వినిపిస్తుంది. అంతే కాదు కరోనా వైరస్ ఎలా సోకుతుందో తెలీక ఎప్పుడు ఎవరి నుంచి కరోనా అటాక్ చేస్తుందో తెలియక జనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక గాలి నుండి కరోనా వస్తుందని కొందరు, రాదనీ కొందరు అయోమయానికి గురి చేస్తున్నారు.

రోగి దగ్గినా తుమ్మినా తుంపరల ద్వారా కరోనా వ్యాప్తి

రోగి దగ్గినా తుమ్మినా తుంపరల ద్వారా కరోనా వ్యాప్తి


ఇప్పటివరకు కరోనా సోకడానికి కరోనా పాజిటివ్ రోగుల నోటి నుండి దగ్గినప్పుడు , ముక్కు నుండి తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లు కారణమని తెలిసినా ఇప్పటికీ ప్రజల్లో గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందా అన్న అనుమానాలు లేకపోలేదు . ఇంతకీ గాలిద్వారా కరోనా సోకుతుందా..? వైద్య నిపుణుల పరిశోధనలు ఏం చెబుతున్నాయి అంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చిన తుంపరల ద్వారానే కాక ఆ వ్యక్తి ముట్టుకున్న వస్తువుల్ని ఇతరులు తాకినా వైరస్ వ్యాపిస్తుందనేది కూడా నిపుణులు తేల్చారు. అయితే కరోనా వ్యాప్తి గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందా అంటే ఎవరూ కచ్చితంగా చెప్పని పరిస్థితి .

కరోనా పేషెంట్లపై అధ్యయనం .. గాలి ద్వారా వైరస్ వ్యాపించలేదు : ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా పేషెంట్లపై అధ్యయనం .. గాలి ద్వారా వైరస్ వ్యాపించలేదు : ప్రపంచ ఆరోగ్య సంస్థ


ఇక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తుంపర్ల ద్వారా వైరస్ గాలిలో ప్రయాణిస్తుందని తెలిపింది. అయితే ఈ వైరస్ గాలిలో ఎక్కువ సేపు బతకదని కరోనా సోకిన వ్యక్తి పక్కన ఉన్న వారికి మాత్రమే ఇది ప్రమాదకరమని తెలిపింది. చైనాలో 75 వేల 465 మంది కరోనా పేషెంట్లను చెక్ చెయ్యగా గాలి ద్వారా వైరస్ వ్యాపించినట్లు తేలలేదని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ . అయితే గాలి ద్వారా వైరస్ వ్యాపించదు అనే విషయాన్ని మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ కచ్చితంగా చెప్పలేదు కానీ ప్రజలు టెన్షన్ పడకుండా తగిన జాగ్రత్తలు పాటించమని పేర్కొంది .

 గాలి ద్వారా వైరస్ సోకే ప్రమాదం : మెడ్ RXIV

గాలి ద్వారా వైరస్ సోకే ప్రమాదం : మెడ్ RXIV

ఇక గాలి ద్వారా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని తెలిపింది మరో అధ్యయనం చేసిన ఒక సంస్థ . గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకటం సాధ్యమే అని వెల్లడించింది మెడ్ RXIV. అయితే అత్యంత అరుదుగానే ఇది సోకుతుందని తెలిపిన సంస్థ పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు పేర్కొంది. ఇక అయితే కరోనా బాధితుల నుండి బయటకు వచ్చే వైరస్ గాలిలో మూడు గంటల కంటే ఎక్కువగా బతకలేదని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించింది.

గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం : అమెరికన్ సైంటిస్ట్

గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం : అమెరికన్ సైంటిస్ట్

ఇక కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందని అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణ శ్వాస తీసుకోవడం ,మాట్లాడం నుండి గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకి ఉండవచ్చని శుక్రవారం ఓ అమెరికా సైంటిస్ట్ తెలిపారు. అమెరికాలో ప్రతిఒక్కరూ ఫేస్ మాస్క్ లు ఉపయోగించాలని సిఫారసు చేశారు . నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో అంటు వ్యాధుల డిపార్మెంట్ హెడ్ గా ఉన్న ఆంథోనీ ఫౌసీ ప్రజలు కేవలం మాట్లాడేటప్పుడు కూడా దగ్గు మరియు తుమ్ముకు వ్యతిరేకంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు.

English summary
Corona infection through the air ..? Experts say that what the researchers say is that not only the sneezing and coughing, but also the virus that spreads when the person touches them . However, whether the corona outbreak is spread by air means that no one can say for sure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X