వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా సత్తా తెలుసుకో: మోడీని టార్గెట్ చేసిన చైనా, ఇండియాను తరిమేందుకు చైనా ఆపరేషన్!

భారత ప్రధాని నరేంద్ర మోడీ మా దేశ సైన్యం సత్తా ఏమిటో తెలుసుకోవాలని చైనా హెచ్చరించే ప్రయత్నాలు చేసింది. సరిహద్దులో భారత్ దళాలను చైనా మిలిటరీ తుద ముట్టించగలదని అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మా దేశ సైన్యం సత్తా ఏమిటో తెలుసుకోవాలని చైనా హెచ్చరించే ప్రయత్నాలు చేసింది. సరిహద్దులో భారత్ దళాలను చైనా మిలిటరీ తుద ముట్టించగలదని అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది.

మా ఓపిక నశిస్తోంది: భారత్‌కు చైనా, నౌకాదళాన్ని శక్తిమంతం చేస్తున్న ఇండియా మా ఓపిక నశిస్తోంది: భారత్‌కు చైనా, నౌకాదళాన్ని శక్తిమంతం చేస్తున్న ఇండియా

భారత్‌ను ప్రమాదంలో పడేస్తున్నారు

భారత్‌ను ప్రమాదంలో పడేస్తున్నారు

ప్రధాని నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్ సరిహద్దుల్లో అంతర్జాతీయ విలువలను తుంగలో తొక్కుతోందని ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఇండియా ప్రైడ్‌ను ప్రమాదంలో పడేస్తున్నారని, ప్రశాంత అభివృద్ధిని ప్రమాదంలో పడేస్తున్నారని పేర్కొంది.

భారత్ ఆపలేదు

భారత్ ఆపలేదు

మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు, డొక్లామ్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ యుద్ధం దిశగా తమను పురికొల్పుతోందని, అదే జరిగితే భారత్ ఆపలేదని హెచ్చరించింది.

ఇండియన్ ఆర్మీని తరిమి కొట్టేందుకు ఆపరేషన్

ఇండియన్ ఆర్మీని తరిమి కొట్టేందుకు ఆపరేషన్

డొక్లామ్‌లో మోహరించిన భారత సైన్యాన్ని తరిమికొట్టేందుకు చిన్నస్థాయి మిలిటరీ ఆపరేషన్‌ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఈ వారాంతంలో చేపట్టనుందని పలువురు నిపుణులను ఉటంకిస్తూ కూడా గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

ఎక్కువ కాలం సహించలేం

ఎక్కువ కాలం సహించలేం

చైనా భూభాగంలోకి భారత సైనికుల చొరబాటును ఎక్కు కాలం చైనా సహించలేదనే విషయాన్ని గడిచిన 24 గంటల్లో చైనా వైపు నుంచి వెలువడిన వ్యాఖ్యలు.. భారత్‌కు తెలిపాయి. అయినా భారత్ తగ్గడానికి నిరాకరిస్తే రెండు వారాల్లో చైనా చిన్నస్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టవచ్చునని పేర్కొంది.

ఏమాత్రం తగ్గని భారత్

ఏమాత్రం తగ్గని భారత్

డొక్లామ్‌లో భారత్ ఏమాత్రం తగ్గటం లేదు. ఇటీవలే 400 మంది భారత్ జవాన్ల సంఖ్య 40కి తగ్గిందని పేర్కొంది. వారు, వారితో ఓ బుల్డోజర్ చైనా భూభాగంలో వంద మీటర్లు ముందుకు వచ్చారని నాలుగు రోజుల క్రితం చైనా విదేశాంగ శాఖ ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. దానిని భారత్ తోసిపుచ్చింది. ఆ 400 మంది సైనికులు అంగుళం కూడా వెనక్కి కదల్లేదని, చైనా బలగాలు ముందుకు రాకుండా గోడలా అడ్డుకుంటున్నాయని తేల్చి చెప్పింది.

చైనా వ్యూహం ఇలా

చైనా వ్యూహం ఇలా

డొక్లామ్ ప్రతిష్టంభన నెలకొని 50 రోజులు అయింది. అది భూటాన్ భూభాగం. అక్కడ చైనా రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయగా అది తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని భారత్ అడ్డుపడింది. కానీ చైనా మాత్రం వివాదాన్ని పెద్దది చేసింది. చైనా ఎప్పుడూ తొలుత సైనిక బలంతో ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించడం, తర్వాత అది తమ అంతర్భాగమని అన్ని అంతర్జాతీయ వేదికలపై నొక్కి చెప్పడం చేస్తుంటుంది. ఫలితంగా అలాంటి భాగం చైనా ఆక్రమిత భూభాగం కాస్తా.. వివాదాస్పద భూభాగంగా మారిపోతుంది. ఇప్పుడు కూడా చైనా అదే అనుసరిస్తోంది.

English summary
Indian Prime Minister Narendra Modi should be aware of PLA's overwhelming firepower, the Chinese have said. Speaking about the military might of China, an article in the Global Times said that the PLA is perfectly capable of "annihilating all Indian troops" in the border region. This Modi administration is "recklessly breaking international norms and jeopardizing India's national pride and peaceful development", the article also said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X