వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఓపిక నశిస్తోంది: భారత్‌కు చైనా, నౌకాదళాన్ని శక్తిమంతం చేస్తున్న ఇండియా

భారత్ - చైనా సరిహద్దులోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తతపై చైనా మరోసారి స్పందించింది. తాను ఈ అంశంపై నిగ్రహంతో ఉంటున్నామని, కానీ తమ ఓపిక చివరి దశకు వచ్చిందని భారత్‌ను హెచ్చరించింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత్ - చైనా సరిహద్దులోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తతపై చైనా మరోసారి స్పందించింది. తాను ఈ అంశంపై నిగ్రహంతో ఉంటున్నామని, కానీ తమ ఓపిక చివరి దశకు వచ్చిందని భారత్‌ను హెచ్చరించింది.

యుద్ధం కాదు, ఓపిగ్గా ఉన్నాం: డొక్లామ్‌పై సుష్మా, భారత్‌కు చైనా ప్రశంసయుద్ధం కాదు, ఓపిగ్గా ఉన్నాం: డొక్లామ్‌పై సుష్మా, భారత్‌కు చైనా ప్రశంస

కేంద్రమంత్రి సుష్మా స్వారాజ్ రాజ్యసభలో ఈ అంశంపై గురువారం మాట్లాడారు. దీంతో చైనా దీనిపై స్పందించింది. డొక్లామ్ ఘటన ప్రారంభం నుంచి చైనా సానుకూలంగా ముందుకు వెళ్తోందని చైనా డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది.

నిగ్రహంతో ఉన్నాం

నిగ్రహంతో ఉన్నాం

చర్చల ద్వారా పరిష్కారం కోసం తాము చూస్తున్నామని చెప్పారు. తమ సైన్యం కూడా నిగ్రహంతో ఉందని చెప్పారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తెలిపారు.

Recommended Video

Sikkim standoff: India manufactures major part of Sardar Patel Statue in China | Oneindia News
 రంగంలోకి ఐఎన్ఎస్ కల్వారి సబ్ మెరైన్

రంగంలోకి ఐఎన్ఎస్ కల్వారి సబ్ మెరైన్

ఇదిలా ఉండగా, చ‌ర్చ‌ల‌కు ఒప్పుకోకుండా రోజుకో విధంగా హెచ్చ‌రిక‌లు చేస్తున్న చైనా ఆగ‌డాల‌ను దృష్టిలో ఉంచుకుని నావికా ద‌ళాన్ని బ‌ల‌ప‌రిచే ప‌నిలో భార‌త్ నిమ‌గ్న‌మైంది. ఇందులో భాగంగా శ‌త్రువుల‌కు దొర‌క్కుండా భీక‌ర దాడి చేయ‌గ‌ల ఐఎన్ఎస్ క‌ల్వారి స‌బ్‌మెరైన్‌ను రంగంలోకి దించారు.

భారత్ వద్ద 15 సబ్ మెరైన్లు

భారత్ వద్ద 15 సబ్ మెరైన్లు

2005లో చేసుకున్న 3.7 బిలియ‌న్ డాల‌ర్ల ఒప్పందంలో భాగంగా మాజ్‌గావ్ డాక్‌తో క‌లిసి ఫ్రెంచ్ నేవీ సంస్థ నిర్మిస్తున్న ఆరు స‌బ్ మెరైన్ల‌లో ఐఎన్ఎస్ క‌ల్వారి మొద‌టిది. భార‌త ర‌క్ష‌ణ‌లో భాగంగా హిందూ మ‌హాస‌ముద్రంలో భార‌త స‌బ్ మెరైన్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. ప్ర‌స్తుతం భార‌త్ ద‌గ్గ‌ర కేవ‌లం 15 స‌బ్ మెరైన్లు మాత్ర‌మే ఉన్నాయి.

చైనా కూడా సబ్ మరైన్లను దించింది కానీ

చైనా కూడా సబ్ మరైన్లను దించింది కానీ

చైనా నావికా ద‌ళంలో దాదాపు 60 స‌బ్ మెరైన్లు ఉన్న‌ట్లు అమెరికా ర‌క్ష‌ణ సంస్థ పెంట‌గాన్ రిపోర్ట్‌లో తేలింది. అంతేకాకుండా చైనా కూడా హిందూ మ‌హాస‌ముద్రంలో త‌మ స‌బ్‌మెరైన్ల‌ను దింపింద‌ని, అవి రాడార్‌కు కూడా చిక్క‌డం లేద‌ని స‌మాచారం. అలాగే పాకిస్థాన్ కూడా ఈ మ‌ధ్య న్యూక్లియ‌ర్ స‌బ్ మెరైన్ల కొనుగోలుపై దృష్టి సారించిన నేప‌థ్యంలో జ‌లాంత‌ర మార్గాల్లో భార‌త్‌కు యుద్ధ ప్ర‌మాదాలు అధికంగా ఉండే అవ‌కాశముంది.

నావికాదళాన్ని శక్తిమంతం చేయాలని

నావికాదళాన్ని శక్తిమంతం చేయాలని

దీర్ఘకాలిక ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం, యుద్ధం గురించిన నిర్ల‌క్ష్యాల కార‌ణంగా నావికా ద‌ళాన్ని శక్తిమంతం చేసుకోవడంలో భార‌త్ విఫ‌ల‌మైంద‌ని ర‌క్ష‌ణ ప‌రిశోధ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమైనా వీలైనంత త్వ‌ర‌గా భార‌త నావికా ద‌ళాన్ని బ‌లప‌రిచే ప్ర‌య‌త్నాలు చేయాల‌ని వారు సూచిస్తున్నారు.

English summary
We have shown utmost goodwill on the Doklam standoff, but our restraint levels too have hit a bottom line, China has told India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X