వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియా కిమ్ కు మరో షాక్ ఇచ్చిన చైనా!

ఉత్తరకొరియా కార్మికుల్ని పనుల్లో నియమించుకోవద్దని చైనా ప్రభుత్వం తన ప్రజలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు దక్షిణకొరియా కూడా ఉత్తరకొరియా వలసదారులపై కనికరం చూపెట్టొద్దంటూ కాస్త ఘాటుగానే చైనా ప

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు చైనా షాక్ ఇచ్చింది. వరుస అణ్వస్త్రాల పరీక్షలతో ఉత్తరకొరియా ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా దేనికీ లొంగకపోవడంతో చైనా దాని కార్మికులను బ్యాన్ చేసింది.

ఉత్తరకొరియా కార్మికుల్ని పనుల్లో నియమించుకోవద్దని చైనా ప్రభుత్వం తన ప్రజలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు దక్షిణకొరియా కూడా ఉత్తరకొరియా వలసదారులపై కనికరం చూపెట్టొద్దంటూ కాస్త ఘాటుగానే చైనా ప్రజలను హెచ్చరిస్తోంది.

Don't Allow North Korean Workers into Jobs: China warned it's own People

అధికారిక లెక్కల ప్రకారం దక్షిణకొరియాకు వలస వచ్చిన వారి సంఖ్య గతేడాదితో పోల్చితే 12 శాతం తగ్గిందని అమెరికా కేంద్రంగా కార్యకలపాలను కొనసాగిస్తోన్న యోనోప్ అనే న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అందుకు కారణం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులేనని ఆ సంస్థ చెబుతోంది.

ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగష్టు వరకు వలసవచ్చిన వారు 10 శాతం తగ్గిపోయారంది. గతంలో ఎక్కువ మంది దక్షిణకొరియాకు, చైనాకు వివిధ పనుల కోసం వలసవెళ్లేవారని యోనోప్ తెలిపింది.

ప్రస్తుతం అన్ని దేశాలు ఉత్తరకొరియా వలస కార్మికులను రానివ్వడం లేదు. దాంతో ఉత్తరకొరియా వలసదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనా ప్రభుత్వం ఏకంగా ఉత్తరకొరియా, చైనా సరిహద్దుల్లో వలసదారులను రావొద్దంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేసిందని యోనోప్ తెలిపింది.

English summary
China Warned it's own citizens to not to give jobs for North Korean workers. China has been cutting the number of workers from North Korea it allows in by tightening checks on potential visiting workers and making the paperwork more difficult. There’s still a flow of workers coming into China. But if there’s a new round of tougher sanctions, no doubt we’ll see a further drop in the number of workers coming from North Korea to China. Estimates of North Korea’s overseas workers vary greatly but a study by South Korea’s state-run Korea Institute for National Unification put the number as high as 150,000, primarily in China and Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X