వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్‌ఖాన్! ఇలా చేస్తావా... మోడీ బెదిరింపులకు భయపడకు: అజహర్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మసూద్ అజహర్‌కు చెందిన సంస్థతో సహా రెండు తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్ చర్యలు తీసుకుంది. వాటిని నిషేధించింది. దీనిపై మసూద్ అజహర్ పాక్‌కు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ బెదిరింపులకు లొంగవద్దన్నారు.

భారత్‌ ఒత్తిళ్లకు తలొగ్గి తనపై చర్యలకు పూనుకోవద్దని మసూద్‌ అజహర్ అన్నాడు. ఈ మేరకు ఓ ఆడియో సందేశంలో పాకిస్థాన్‌ ప్రభుత్వంతో పాటు ఆ దేశ మీడియాకు కూడా హెచ్చరికలు జారీ చేశాడు.

<strong>భారత్ దెబ్బ మీద దెబ్బ, దిగొచ్చిన పాకిస్తాన్: హఫీజ్ సంస్థతో పాటు రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధం </strong>భారత్ దెబ్బ మీద దెబ్బ, దిగొచ్చిన పాకిస్తాన్: హఫీజ్ సంస్థతో పాటు రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధం

మోడీ బెదిరింపులకు ఇమ్రాన్ స్పందన పేలవం

మోడీ బెదిరింపులకు ఇమ్రాన్ స్పందన పేలవం

భారత ప్రధాని నరేంద్ర మోడీ బెదిరింపులకు ప్రతిగా పాకిస్తాన్ ప్రధాని స్పందన చాలా పేలవంగా ఉందని, దీనిని బట్టి చూస్తే భారత్‌కు పాకిస్తాన్ భయపడుతున్నట్లుగా ఉందని అవగతమవుతోందని మసూద్ అజహర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. పాక్‌ స్పందన తనను నిరాశకు గురి చేసిందని చెప్పాడు. అలాగే పాకిస్తాన్ మీడియాపై కూడా అజహర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 మోడీకి లాభించనున్నట్లు విశ్లేషణలు వచ్చాయి కానీ

మోడీకి లాభించనున్నట్లు విశ్లేషణలు వచ్చాయి కానీ

పుల్వామా దాడి అంశం వచ్చే భారత్ సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి లాభించనున్నట్లు విశ్లేషణలు వచ్చాయని, అవి సరికాదని ఖండించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం‌ చర్యలు ఫలిస్తున్నాయన్న మోడీ వాదన అర్థరహితమని, పుల్వామా దాడితో తేలిపోయిందని అజహర్ చెప్పాడు.

 అజహర్‌లో భయం.. అందుకే పాక్‌కు బెదిరింపు

అజహర్‌లో భయం.. అందుకే పాక్‌కు బెదిరింపు

కాగా, దాడికి కారణమైన వారిని భారత బలగాలు కేవలం వంద గంటల్లోపు మట్టుబెట్టడంతో జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాదుల్లో అభద్రత నెలకొందని, అందుకే మసూద్‌ అజహర్ ఈ విధంగా మాట్లాడుతున్నాడని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. పుల్వామా చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు పదిహేను, ఇరవై మంది పాకిస్థాన్‌ ఉగ్రవాదులు, ఇరవై ఇరవై ఐదు మంది జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాదులు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ముఖ్యమైన వారిని త్వరలోనే పట్టుకుంటామని, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరుగుతుండడంతో మసూద్‌ భయపడుతున్నట్లు అర్థమవుతోందని, అందుకే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడని ఆర్మీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, పుల్వామా దాడి నేపథ్యంలో ఆగ్రహం చవిచూస్తున్న పాకిస్తాన్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు ఉగ్రవాద సంస్థలను నిషేధిస్తూ పాకిస్తాన్ జాతీయ భద్రతా విభాగం కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒకటి జమాత్ ఉద్ దవా, రెండోది ఫలాహీ ఇన్సానియత్ ఫౌండేషన్. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఈ నిషేధం విధించింది. జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్.

English summary
Wanted terrorist and the chief of UN designated terrorist organisation Maulana Masood Azhar on Thursday warned the Imran Khan government against buckling under Indian pressure and taking action against him in the aftermath of the Pulwama terror attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X