వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం తల్చుకుంటే భారత్‌లో ఒక్క నగరం మిగలదు.. జాగ్రత్త: భారత్ కు పాక్ హెచ్చరిక

మేం తల్చుకుంటే భారత్‌లో ఒక్క నగరం మిగలదు.. ఢిల్లీ సహా పలు నగరాలను నేల మట్టం చేస్తాం.. మా అణు శక్తిని తట్టుకోలేరు.. అంటూ భారత్‌ను పాకిస్తాన్‌ హెచ్చరించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ : మేం తల్చుకుంటే భారత్‌లో ఒక్క నగరం మిగలదు.. ఢిల్లీ సహా పలు నగరాలను నేల మట్టం చేస్తాం.. మా అణు శక్తిని తట్టుకోలేరు.. అంటూ భారత్‌ను పాకిస్తాన్‌ హెచ్చరించింది.

అంతేకాదు, ఐఎస్‌ఐతో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న అమెరికా ప్రకటనపైనా స్పందించింది. అమెరికాలోని గన్‌ లాబీయిస్టులకే ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పాక్‌ వ్యాఖ్యానిం‍చింది.

khawaja-asif

'భారత ప్రభుత్వం ఆదేశిస్తే.. ఏకకాలంలో చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధం చేయగలమని.. అవసరం అయితే పాకిస్తాన్‌లోని అణ్వాయుధ స్థావరాలపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తామని..' ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా ప్రకటనపై పాక్‌ ప్రతిస్పందించింది.

మేం తల్చుకుంటే భారత్‌లోని ఏ నగరాన్ని అయినా నేలమట్టం చేయగలని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ శుక్రవారం ప్రకటించారు. అంతేకాక మా అణుశక్తిని తట్టుకుని భారత్‌ నిలబడలేదని కూడా ఆయన హెచ్చరించారు.

సరిహద్దునుంచి లక్ష్యం నిర్ణయించి మా అణ్వాయుధాలను వదిలితే.. క్షణాల్లో ఢిల్లీ సహా పలు నగరాలు నేలమట్టం అవుతాయని ఆయన అన్నారు. ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో పాక్‌ ఒకటని ఆయన చెప్పారు.

పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలను ఆసిఫ్‌ ఖండించారు. అసలు అమెరికాలోని గన్‌ లాబీ సంస్థలకే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెప్పారు. ఇందుకు లాస్‌వేగాస్‌ ఘటనే నిదర్శనమని అన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి గన్‌ లాబీనే కారణమని వ్యాఖ్యానించారు.

English summary
Pakistan’s Foreign Minister Khawaja Asif on Thursday warned India against targeting its nuclear installations, and said that nobody should expect restraint from Islamabad if that happens, the Dawn reported. Asif’s comments follow Indian Air Chief Marshal BS Dhanoa’s remark that New Delhi can fight a war on two fronts. Dhanoa was responding to queries about about Pakistan claiming that it was developing short-range nuclear weapons to counter India. Dhanoa had said that India had the capability to “locate, fix and strike across the border” to counter Pakistan’s nuclear weapons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X