వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐకమత్యంగా ఉందాం .. లేదంటే ముస్లిం ప్రభాకరన్ పుట్టుకొస్తాడు : మైత్రిపాల సిరిసేన

|
Google Oneindia TeluguNews

కొలంబో : ఈస్టర్ సండే రోజున జరిగిన గాయాన్ని శ్రీలంక ఇప్పటికీ మరచిపోలేదు. ఆ రోజు ఉగ్రవాదులు సృష్టించిన నరమేధాన్ని తలచుకొని ఉలిక్కిపడుతున్నారు. దాదాపు 250 మంది చనిపోవడం .. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందడంతోపాటు శ్రీలంక పర్యాటక రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. దీనిపై శ్రీలంక అధ్యక్షుడు జాతికి సందేశమిచ్చారు. మనమంతా ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

జాతికి సందేశం
ఏప్రిల్ 21న ఘటనను గుర్తుచేసుకొని ప్రజలకు సందేశమిచ్చారు లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. మనమంతా ఐకమత్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లేదంటో ముస్లిం ప్రభాకరన్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని అన్ని కులాలు, మతాలవారు ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టంచేశారు. తమకు ప్రత్యేక దేశం కావాలని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనే సంస్థను స్థాపించి ప్రభాకరన్ పోరాడిన సంగతి తెలిసిందే. కానీ అతడిని శ్రీలంక సైన్యం మట్టుబెట్టడంతో ఎల్టీఈఈ కనుమరుగైన సంగతి విదితమే.

Dont let Muslim Prabhakaran be born: Sri Lankan President Sirisena calls for unity

ముస్లిం ప్రభాకరన్
ప్రత్యేక దేశం కోసం ప్రభాకరన్ తన సైన్యంతో పోరాడటంతో 2009లో శ్రీలంక సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రభాకరన్ అంశం సమాప్తమైంది. ఇప్పుడు మరో ప్రభాకరన్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే ముస్లిం ప్రభాకరన్ వస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు మైత్రిపాల సిరిసేన. ఈస్టర్ సండే రోజు చనిపోయిన వారికి ప్రధాని మోడీతో కలిసి నివాళులర్పించారు సిరిసేన. ఈ సందర్భంగా శ్రీలంకన్లంతా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

English summary
Warning against the emergence of a "Muslim Prabhakaran", Sri Lankan President Maithripala Sirisena has called for unity among all communities in the country which saw the worst terror attack on Easter Sunday. Acknowledging that the country has now been divided, Sirisena, who spoke in Mullaitivu, a former bastion of the Liberation Tigers of Tamil Eelam (LTTE), said on Saturday that religious leaders and politicians in the country were divided today. The President urged the public "not to leave room for a Muslim Prabhakaran to be born," Colombo Gazette reported .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X