కాస్త చదవండి: డొక్లాంపై చైనాకు భూటాన్ దిమ్మతిరిగే షాక్, యుద్ధమా.. ఆ గ్రామం ఖాళీ!

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్/న్యూఢిల్లీ: డొక్లామ్ తమదేనని భూటాన్ అంగీకరించిందని చైనా ఇటీవల చెప్పింది. దీనిపై భూటాన్ స్పందించింది. డొక్లామ్ చైనాది అని తాము అంగీకరించలేదని చెప్పింది. చైనా అబద్దాలు ఆడటం సరికాదని పేర్కొంది.

1962 యుద్ధం నుంచి పాఠాలు, ఎవరొచ్చినా సిద్ధమే, ఇదీ మన సత్తా: చైనాపై జైట్లీ

డొక్లామ్ ప్రాంతం చైనాదిగా తాము ఎప్పుడూ చెప్పలేదని, ఎప్పుడూ గుర్తించలేదని భూటాన్ తేల్చి చెప్పింది. తద్వారా డ్రాగన్ కంట్రీకి దిమ్మతిరిగే జవాబు చెప్పింది.

కాస్త చదివి చూడండి

కాస్త చదివి చూడండి

డొక్లామ్ విషయంలో మా ప్రకటన చాలా స్పష్టంగా ఉందని భూటాన్ చెప్పింది. 29 జూన్ 2017న తమ విదేశాంగ వెబ్ సైట్‌లో చదివి తెలుసుకోవాలని చైనాకు సరైన కౌంటర్ ఇచ్చింది. చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ వెన్లీ.. ఎలాంటి ఆధారాలు చూపించకుండా భూటాన్ అంగీకరించిందని చెప్పడం సరికాదని అభిప్రాయపడింది.

Sikkim standoff: India manufactures major part of Sardar Patel Statue in China | Oneindia News
సరిహద్దు గ్రామ ప్రజలు ఖాళీ చేయాలని ఆదేశం

సరిహద్దు గ్రామ ప్రజలు ఖాళీ చేయాలని ఆదేశం

గత రెండు నెలలుగా డొక్లామ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ప్రజలు టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారు. డొక్లామ్ ప్రాంతానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాథంగ్ గ్రామాన్ని ఖాళీ చేయాలని గ్రామస్తులకు చెబుతున్నారు. అయితే, వీరు ఖాళీ చేయడానికి డొక్లామ్ ఇష్యూ కారణం కాదని కూడా అంటున్నారు. వారిని ఖాళీ చేయిస్తుండటంతో యుద్ధం వస్తుందా అనే చర్చ సాగుతోంది.

డొక్లాంలో 53 మంది ఇండియన్ ఆర్మీ: చైనా

డొక్లాంలో 53 మంది ఇండియన్ ఆర్మీ: చైనా

డోక్లాం ప్రాంతంలో 53 మంది భారతీయ సైనికులు, ఒక బుల్‌డోజరు ఉన్నట్లు చైనా విదేశాంగశాఖను ఉటంకిస్తూ....అధికార వార్తాపత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌' తెలిపింది. తక్షణం తమ భూభాగం (చైనా చెప్పుకోవడమే)నుంచి దళాలను ఉపసంహించుకోవలసిందిగా భారత్‌ను కోరింది.

కౌంట్ డౌన్ ప్రారంభమైందని హెచ్చరిక

కౌంట్ డౌన్ ప్రారంభమైందని హెచ్చరిక

డొక్లామ్ ప్రాంతంలో భారత్ సైన్యాన్ని ఉపసంహరించుకోకపోవడంపై చైనా పదే పదే హెచ్చరికలు, ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. భారత్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇరుదేశాల మధ్య యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చైనా మీడియా రాసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
China's claim that Doklam belongs to them is wrong and we never acknowledged it said Bhutan. China had said that Bhutan had agreed that Doklam belongs to the Chinese. This has however been rubbished by Bhutan.
Please Wait while comments are loading...