వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తలను వేధించొద్దు, మేకప్ వేసుకోండి: మహిళలకు మలేషియా కరోనా టిప్స్, చివరకు ఏమైందంటే.?

|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ నుంచి తప్పించుకోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు లాక్‌డౌన్‌ను తమ తమ దేశాల్లో అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ వేళ ప్రజలు ఇబ్బందులు పడకుండా మలేషియా ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. ఆ సూచనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

భార్యాభర్తల కోసమే..

కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లల్లో ఉండే భార్యాభర్తలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. తమ సూచనలు పాటించాలని మలేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది.
లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు ఇళ్లల్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, కొందరు దంపతులు మాత్రం ఇళ్లల్లోనే ఉండటం కారణంగా పనులు, ఇతర విషయాల్లో గొడవలు పడుతున్నారు.

దంపతులు సంతోషంగా ఉండేందుకు..

మార్చి 18 నుంచి మలేషియాలో లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఇళ్లలో ఉంటున్న దంపతులు ఏ ఇబ్బంది పడకుండా ఉండేందుకు మలేషియా ప్రభుత్వం పలు సూచనలు చేసింది. పోస్టర్లు, ఇతర సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. భార్యలు భర్తలతో, భర్తలు భార్యలతో వివాదాలు లేకుండా సంతోషంగా ఉండేందుకు తమ సూచనలు పాటించాలని స్పష్టం చేస్తోంది.

భర్తలను వేధించొద్దు..

ఓ జంట బట్టలు ఆరేస్తున్న పోస్టర్‌ను పోస్టు చేసింది. భర్తను తమ పనుల్లో సాయం చేయాలంటూ భార్యలు వేధించడం మానుకోవాలని మలేషియా ప్రభుత్వం సూచించింది. దీంతో ఈ పోస్టర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సదరు సూచనలు, పోస్టర్లను ఉపసంహరించుకుంది. అయితే, అలాంటి సూచనలే మరికొన్ని చేసింది.

మేకప్ వేసుకోండి.. అందంగా తయారు కండి..

మహిళలు ఇళ్లలో ఉన్నప్పటికీ అందంగా తయారు కావాలని, మేకప్ వేసుకోవాలంటూ మలేషియా ప్రభుత్వం సూచించింది. మంచి బట్టలు వేసుకోవాలని, ఇంటి నుంచి ఆపీసు పనిచేసినా ఆఫీసులో ఉన్నట్లుగానే తయారు కావాలని తెలిపింది. పురుషులను ఇబ్బంది పెట్టొద్దని తెలిపింది. అంతేగాక, పాపులర్ కర్టూన్ క్యాట్ డోరేమాన్ గొంతును మలేషియా ప్రభుత్వం ఉపయోగించడంపైనా విమర్శలు వస్తున్నాయి. మహిళలను తక్కువ చేసేలా మలేషియా ప్రభుత్వం చర్యలు ఉన్నాయంటూ అక్కడి మహిళాలోకం దుమ్మెత్తిపోస్తోంది. ప్రపంచ దేశాల మహిళలు కూడా మలేషియా ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నారు.

మహిళా లోకం ఆగ్రహజ్వాలలు..

మహిళా లోకం ఆగ్రహజ్వాలలు..

తాము ఎలాంటి బట్టలు ధరించాలో, ఎలా అలంకరించుకోవాలో కూడా ప్రభుత్వమే చెబుతుందా? అంటూ మహిళలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ సూచనలు పురుషాధిక్యతకు, గృహహింసను ప్రోత్సహించేవిధంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. కాగా, మహిళలు మేకప్ వేసుకోవడం, తమ భర్తలను సంతోషంగా ఉంచడం ద్వారా కరోనాను ఎలా నివారించవచ్చో ప్రభుత్వం తెలపాలని పలువురు నెటిజన్లు మలేషియా సర్కారును ప్రశ్నిస్తున్నారు.

క్షమించాలంటూ దిగొచ్చిన సర్కారు..

క్షమించాలంటూ దిగొచ్చిన సర్కారు..

అయితే, తాము మహిళలను తక్కువ చేయడం లేదని.. ఇంటి నుంచి పనిచేస్తున్న మహిళలు, వారి కుటుంబసభ్యుల మధ్య సానుకూల సంబంధాలను బలపరిచే లక్ష్యంగానే ఈ సూచనలు చేసినట్లు మలేషియా మహిళలు, కుటుంబసంక్షేమాభివృద్ధి శాఖ వివరణ ఇచ్చుకుంది. తమ చర్య మహిళలోకాన్ని ఇబ్బంది పెట్టివుంటే క్షమించాలని కోరింది. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో మలేషియాలో 50 శాతం గృహహింస ఫిర్యాదులు పెరగడం గమనార్హం. మలేషియాలోనూ కరోనా వైరస్ వ్యాప్తి వేగంగానే జరుగుతోంది. ఇప్పటి వరకు 2వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
'Don't Nag Husband, Wear Makeup': Malaysian Govt's Tips for Women During Corona Lockdown
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X