వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాత్రూమ్ బయట.. మాజీ మోడల్‌కు బలవంతంగా ముద్దు,ఒళ్లంతా తడిమిన ట్రంప్...?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్.. 20 ఏళ్ల క్రితం ఓ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అమీ డోరిస్ అనే మాజీ మోడల్ ఆరోపించారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో పలువురు మహిళలు ట్రంప్‌ లైంగిక వేధింపులను బయటపెట్టినప్పుడు... తానూ నోరు విప్పాలని భావించినట్లు చెప్పారు. అయితే ఎక్కడ తన కుటుంబానికి ఏదైనా జరుగుతుందేమోనన్న భయంతో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. తాజాగా 'ది గార్డియన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీ డోరిస్ ఈ విషయాలను వెల్లడించారు.

 ఎప్పుడు జరిగింది... ఎలా...

ఎప్పుడు జరిగింది... ఎలా...

సెప్టెంబర్ 5,1999లో ఆ సంఘటన జరిగినప్పుడు తన వయసు 24 ఏళ్లు అని,ట్రంప్ వయసు 51 ఏళ్లు అని అమీస్ పేర్కొంది. అప్పటికే ట్రంప్ మర్లా మాపుల్స్‌ను రెండో వివాహం చేసుకున్నట్లు చెప్పింది. అప్పట్లో ఫ్లోరిడాలో ఉండే తనను ఓసారి తన బాయ్‌ఫ్రెండ్ జాసన్ బిన్ వీకెండ్‌లో న్యూయార్క్‌కి తీసుకెళ్లినట్లు చెప్పింది. పలు లగ్జరీ ఫ్యాషన్&లైఫ్ట్ స్టైల్ మేగజైన్స్ వ్యవస్థాపకుడైన బిన్‌కు ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. న్యూయార్క్ వెళ్లాక మాన్‌హట్టాన్‌లోని ట్రంప్ కార్యాలయానికి బిన్ తనను కూడా తీసుకెళ్లాడని... అక్కడ ఆయన్ను మొదటిసారి కలిసినట్లు చెప్పింది.

బలవంతంగా ముద్దు పెట్టిన ట్రంప్...

బలవంతంగా ముద్దు పెట్టిన ట్రంప్...

అనంతరం ట్రంప్‌తో కలిసి తామిద్దరం యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు హాజరైనట్లు చెప్పింది. ఆ స్టేడియం గ్యాలరీలో ట్రంప్‌కు ప్రైవేట్ బాక్స్ ఉందని... అందులోనే కూర్చొని మ్యాచ్‌ని వీక్షించామని చెప్పింది. మ్యాచ్ మధ్యలో తాను ట్రంప్ లగ్జరీ సూట్‌లోని బాత్రూమ్‌కి వెళ్లానని... బయటకొచ్చేసరికి అక్కడ ట్రంప్ నిలుచుని కనిపించాడని చెప్పింది. తప్పుకోవాలని తాను చెప్పినా అతను వినిపించుకోలేదని పేర్కొంది. తనను బలవంతంగా ముద్దు పెట్టుకుని,ఒళ్లంతా చేతులతో తడిమాడని... ఊహించని ఆ సంఘటనకు తాను షాక్ తిన్నానని చెప్పుకొచ్చింది.

ఖండించిన ట్రంప్ లాయర్లు...

ఖండించిన ట్రంప్ లాయర్లు...

అమీ డోరిస్ ఆరోపణలను ట్రంప్ తరుపు లాయర్లు ఖండించారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు రాజకీయ దురుద్దేశంతో ట్రంప్‌పై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. అమీస్ ఆరోపణలపై అప్పటి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ బిన్‌తో కూడా మాట్లాడినట్లు చెప్పారు. అసలు అలాంటి ఘటన ఒకటి జరిగినట్లు,దాని గురించి అమీస్ తనతో చెప్పినట్లు... తనకైతే ఏమీ గుర్తురావట్లేదని చెప్పాడన్నారు. ఆ ఘటన జరిగిందని చెప్తున్న సెప్టెంబర్ 5 తర్వాత కూడా అమీస్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పలుమార్లు ట్రంప్‌ను కలిసిందన్నారు. ఒకవేళ అమీస్ చెప్పినట్లు ట్రంప్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడితే... ఆ తర్వాత కూడా ఆమె ఆయన్ను ఎందుకు కలిసినట్లు అని ప్రశ్నించారు.

Recommended Video

చారిత్రాత్మక సంఘటనకు తెర, Donald Trump సమక్షంలో 3 దేశాల మధ్య శాంతి ఒప్పందాలు! || Oneindia Telugu
ఆ తర్వాత కూడా ఎందుకు కలిసినట్లు..?

ఆ తర్వాత కూడా ఎందుకు కలిసినట్లు..?

అయితే ఆ సంఘటన జరిగాక కూడా మళ్లీ ట్రంప్‌ను ఎందుకు కలిశారని అమీస్‌ను ప్రశ్నించగా.... 'నేను ఫ్లోరిడా నుంచి న్యూయార్క్‌కి వచ్చాను. నా దగ్గర డబ్బు లేదు. ఎక్కడికని వెళ్లగలను. నా బాయ్‌ఫ్రెండ్ జాసన్‌తో ఉంటున్నాను. అతనితో కలిసే పలు ఈవెంట్స్‌కి వెళ్లాను... ఆ సమయంలోనే మళ్లీ ట్రంప్‌ను కలవాల్సి వచ్చింది.' అని అమీస్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన పిల్లలు 13 ఏళ్ల వయసుకు వచ్చారని... తన పిల్లలకు తాను రోల్ మోడల్‌గా ఉండాలనుకుంటున్నానని అమీస్ చెప్పారు. తమకు ఇష్టం లేకుండా ఎవరూ ఏం చేసినా ఒప్పుకోవద్దన్నారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే గట్టిగా ఫైట్ చేయాలన్నారు.

English summary
A former model has come forward to accuse Donald Trump of sexually assaulting her at the US Open tennis tournament more than two decades ago, in an alleged incident that left her feeling “sick” and “violated”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X