వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యర్థి జో బిడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలనం: డ్రగ్స్ తీసుకుంటున్నారు, టెస్ట్ చేయాలి!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా నిలిచిన డెమెక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. చర్చా వేదికల్లో జో బిడెన్ తన ప్రదర్శన మెరుగ్గా ఉండేందుకు డ్రగ్స్ తీసుకుంటారని ట్రంప్ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ట్రంప్ విమర్శల దాడిని మరింత పెంచారు.

డిబేట్లలో జో బిడెన్ మెరుగయ్యారు...?

డిబేట్లలో జో బిడెన్ మెరుగయ్యారు...?

బిడెన్ చర్చా వేదికల్లో చాలా బాగా మాట్లాడుతున్నారని, ఇంతకుముందు ఇలా లేరని ట్రంప్ అన్నారు. జో బిడెన్ డ్రగ్స్ తీసుకోవడం వల్లే ఇలా ఉత్సాహంగా డిబేట్లలో పాల్గొంటున్నారని ఆరోపించారు. జో బిడెన్ ఒక అసమర్థుడు, అమెరికాకు ఒక విపత్తు అని ట్రంప్ ఇంతకుముందు విమర్శించిన విషయం తెలిసిందే. వామపక్ష ప్రత్యర్థి బెర్నీ సాండర్స్‌తో చర్చ జరిగినప్పుడు బిడెన్ ఒకే అనిపించారని వ్యాఖ్యానించారు. జో బిడెన్ డిబేట్స్‌లో మెరుగుదల కనిపించడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

డ్రగ్స్ తీసుకోవడం వల్లే..

డ్రగ్స్ తీసుకోవడం వల్లే..

అయితే, జో బిడెన్ డ్రగ్స్ తీసుకోవడం వల్లే ఇంత ఉత్సాహంగా డిబేట్స్‌లో పాల్గొంటున్నారని, అతని చర్చ కూడా బాగా మెరుగుపడిందని అన్నారు. అయితే, దీనిపై స్పష్టత రావాలన్నారు. ఈ నేపథ్యంలో జో బిడెన్‌కు డ్రగ్ టెస్ట్ నిర్వహించాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 29 తొలి మూడు డిబేట్స్ జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాను కూడా ఒక చర్చను తీసుకుంటానని అన్నారు.

బిడెన్ మానసిక రోగి అంటూ..

బిడెన్ మానసిక రోగి అంటూ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచీ జో బిడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. 77 ఏళ్ల జో బిడెన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ట్రంప్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. జో బిడెన్ ఎన్నికల్లో ఓటమి పాలవుతారని.. ఒక మానసిక రోగిని అమెరికా అధ్యక్షుడిగా ప్రజలు చూడలేరని అన్నారు.

బిడెన్ గెలుపు కోసం రష్యా, చైనా కుట్రలు..

బిడెన్ గెలుపు కోసం రష్యా, చైనా కుట్రలు..

డెమోక్రాట్ల నుంచి కూడా విమర్శలు అదే స్థాయిలో వస్తుండటంతో ట్రంప్ మరింత రెచ్చిపోతున్నారు. రష్యా, చైనాలు తన ఓటమిని కోరుకుంటున్నాయని, జో బిడెన్ కోసం ఈ రెండు దేశాలు కుట్రలు చేసే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాను గెలవకుంటే అమెరికా ప్రతిష్ట దిగజారుతుందని చెబుతున్నారు.

English summary
President Donald Trump, in his latest shredding of political niceties, suggested Tuesday that his Democratic opponent Joe Biden has taken drugs to improve his performance in debates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X