వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బైడెన్ గెలిస్తే చైనాకే అమెరికా ఉద్యోగాలు: ఆటలు సాగనివ్వనంటూ డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి జో బైడెన్‌పై విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. జో బైడెన్ కూడా అదే స్థాయిలో బదులు ఇస్తుండటంతో ట్రంప్ మరింతగా రెచ్చిపోతున్నారు. మొదట అమెరికన్లకే ఉద్యోగాలు అనే నినాదాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు.

 అమెరికా ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ- ట్రంప్‌ కరోనాతో అనిశ్చితి- చేతులెత్తేస్తున్న విశ్లేషకులు అమెరికా ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ- ట్రంప్‌ కరోనాతో అనిశ్చితి- చేతులెత్తేస్తున్న విశ్లేషకులు

బైడెన్ గెలిస్తే.. చైనాకే ఉద్యోగాలన్నీ..

బైడెన్ గెలిస్తే.. చైనాకే ఉద్యోగాలన్నీ..

తాజాగా, చైనాను తెరపైకి తెస్తూ డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌‌పై ఎదురుదాడికి దిగారు. అధ్యక్ష ఎన్నికల్లో ఒక వేళ జో బైడెన్ గెలిస్తే.. అమెరికాలోని ఉద్యోగాలన్నీ చైనాకు తరలిపోతాయని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. గత 50 ఏళ్లుగా ఆయన సెనేటర్‌గా, దేశ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇదే చేశారని ట్రంప్ విమర్శించారు. పదవీ కాలం ప్రారంభం నాడు ఉన్న ఉద్యోగాలు ముగింపు నాడు లేకపోవడం ఒక్క ట్రంప్ హయాంలోనే జరిగిందని బైడెన్ విమర్శించిన నేపథ్యంలో ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు.

బైడెన్ ప్రయత్నాలను అడ్డుకుంటాం: ట్రంప్

బైడెన్ ప్రయత్నాలను అడ్డుకుంటాం: ట్రంప్

దేశాన్ని సామ్యవాదంవైపు నడిపించేందుకు బైడెన్ ప్రయత్నించారని, తాను అది జరగనివ్వని ట్రంప్ స్పష్టం చేశారు. డెమోక్రాట్లది సామ్యవాద విధానమని, అంతేగాక, సామ్యవాదానికి మించిన కమ్యూనిజం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాకు తరలిన ఉద్యోగాలను తాను తిరిగి తీసుకువస్తున్నట్లు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ బ్లూరూం బాల్కనీ నుంచి ప్రజనుద్దేశించి మాట్లాడారు. కాగా, ట్రంప్‌కు కరోనా వచ్చిన నేపథ్యంలో జో బైడెన్‌తో జరగాల్సిన రెండో డిబేట్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Recommended Video

Donald Trump's Telangana Fan Bussa Krishna Lost Life ట్రంప్‌ మీద పిచ్చి ప్రేమతో అభిమాని మృతి
ట్రంప్ గెలిస్తే అమెరికా పరిస్థితి ఇంక అంటే: బైడెన్

ట్రంప్ గెలిస్తే అమెరికా పరిస్థితి ఇంక అంటే: బైడెన్

ఇది ఇలావుంటే, జో బిడెన్ కూడా ట్రంప్‌కు ఏ మాత్రం తగ్గకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో సంపన్నులు మరింత కుబేరులుగా మారారని, మధ్యతరగతి, పేద ప్రజల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయిందని విమర్శించారు. కరోనా మహమ్మారి కట్టడిలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ ఏడాది 100 మంది బిలియనీర్లు 300 బిలియన్ డాలర్లు సంపాదించారని బైడెన్ అన్నారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడైతే అమెరికా ప్రతిష్ట మరింత దిగజారుతుందని ఆరోపించారు.

English summary
US President Donald Trump has alleged that Democratic presidential candidate Joe Biden in his previous capacities as Senator and vice president was busy shipping jobs to China, prompting the latter to hit back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X