వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభిశంసన నుంచి గట్టెక్కిన డొనాల్డ్ ట్రంప్, వీగిపోయిన రెండు తీర్మానాలు, రిపబ్లికన్ల హర్షం..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Day Light Report : 3 Minutes 10 Headlines | Trump impeachment | Medaram Jatara | Nithyananda Bail

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం నుంచి గట్టెక్కారు. అధికార దుర్వినియోగం చేస్తూ, దేశ ద్రోహనికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు రెండు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ ఆంక్షలపై చాలామంది సెనేటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినా.. రెండు తీర్మానాలు వీగిపోవడం విశేషం.

రెండు తీర్మానాలు

రెండు తీర్మానాలు

అభిశంసన తీర్మానం నుంచి డొనాల్డ్ ట్రంప్ గట్టెక్కారు. 58-48, 53-47 తేడాతో అభిశంసన తీర్మానం నుంచి ట్రంప్‌కు ఉపశమనం లభించింది. మొదటి అభియోగంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ మిట్ రోమ్ని వ్యతిరేకంగా ఓటువేశారు. 2012లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా బరిలోకి కూడా దిగారు. డొనాల్డ్ ట్రంప్‌పై మిట్ రోమ్నీ తొలినుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే రెండో తీర్మానంపై మాత్రం పార్టీకి లోబడి తన ఓటును వేశారు. మిగతా సభ్యులు కూడా పార్టీకి లోబడి ఓటు వేయడంతో అభిశంసన తీర్మానం నుంచి ట్రంప్ గట్టెక్కారు.

సరికాదు..

సరికాదు..

డెమోక్రాటిక్ పార్టీపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇప్పుడే కాదు గతంలో కూడా వారు ఇలాగే ప్రవర్తించారని ఆరోపించారు. 2020లో వారు చేసిన చర్యను అమెరికన్లు గమనించాలని పేర్కొన్నారు. అభిశంసన తీర్మానం నుంచి గట్టెక్కిన డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం వైట్‌హౌస్ నుంచి ప్రసంగింస్తారు. అభిశంసన తీర్మానం బూటకమని డెమోక్రట్లపై విరుచుకుపడే అవకాశం ఉంది.

 నిరాధార

నిరాధార

డెమోక్రాట్ల చర్యను వెట్ హౌస్ మీడియా కార్యదర్శి స్టీపెన్ గ్రిషమ్ కూడా తప్పుపట్టారు. నిరాధార ఆరోపణలతో డెమోక్రట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఓడిపోయింది. ట్రంప్ దోషి కాదని, లేనిపోనివి ఆపాదించి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ట్రంప్ ప్రత్యర్థులు తీర్మానం ప్రవేశపెట్టగా.. సెనేటర్లు తోసిపుచ్చారని పేర్కొన్నారు.

English summary
President Donald Trump has won an impeachment acquittal in the US Senate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X