వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఐటీ నెత్తిన ట్రంప్ పిడుగు.. ఔట్‌సోర్సింగ్, హెచ్-1బీ వీసాలపై సమీక్షిస్తామంటూ ప్రకటన

భారత ఐటీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. అమెరికాలో ఉండే ఐటీ కంపెనీలు విదేశాలకు ఔట్‌సోర్సింగ్ ఇవ్వడంపై సమీక్షిస్తామంటూ ప్రకటించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత ఐటీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. అమెరికాలో ఉండే ఐటీ కంపెనీలు విదేశాలకు ఔట్‌సోర్సింగ్ ఇవ్వడంపై సమీక్షిస్తామంటూ ప్రకటించారు.

తాము ఇచ్చిన కాంట్రాక్టులపై నివేదిక ఇవ్వాలని భారత కంపెనీలయిన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్‌లను అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. అమెరికాలో 3.5 శాతం కాంట్రాక్టులను భారత కంపెనీలే దక్కించుకున్నాయి. వీటి విలువ వేల కోట్ల డాలర్లు ఉంటుంది.

ఔట్‌సోర్సింగ్ విధానాలనే కాకుండా, హెచ్-1బీ వీసాలపై కూడా సమీక్షించాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించడంతో భారత ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్‌లో కూడా ఆంక్షలు విధిస్తే భారత ఐటీ కుప్పకూలుతుందని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Donald Trump Administration May 'Review' US Govt Contracts Outsourced to Indian IT Giants

అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులను విదేశీ కంపెనీలకు ఇవ్వొద్దని ట్రంప్ చెబుతున్నారు. గతంలో ఒబామా సర్కారు హయాంలో భారత ఐటీ కంపెనీలు చేజిక్కించుకున్న ప్రాజెక్టులను సమీక్షించేందుకు ప్రస్తుతం ట్రంప్ సిద్ధమయ్యారు.

'బై అమెరికన్, హైర్ అమెరికన్', అమెరికన్లకు ఉద్యోగాలు అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్.. విదేశీ కంపెనీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా కంపెనీలకు, అమెరికన్లకు తన ప్రభుత్వంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తేల్చిచెబుతున్నారు.

ట్రంప్ నిర్ణయాలతో భారత్‌లోని ఐటీ కంపెనీల్లో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
The Donald Trump administration may be on course to “reviewing” contracts given to foreign companies, including Indian giants like TCS and Infosys, sources told CNBC-TV18 on Thursday. Sources said the Indian companies have been asked to submit a progress report of the current projects outsourced to them by the US government. The contracts will be reviewed over a period of four months, sources added. The US government contracts account for about 3.2-3.5% of exposure to Indian tech giants. At present, Cognizant, Tata Consultancy Services and Infosys are among Indian firms working on US government contracts. This is yet another move in Trump’s efforts to try and keep jobs at home in keeping with his election pitch of ‘Buy American, Hire American’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X