• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్నంత పనీ చేసిన ట్రంప్... దిగుమతి సుంకంతో ప్రపంచ దేశాలకు షాక్!

By Ramesh Babu
|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. హఠాత్తుగా స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించి ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేశారు. ఇంత కీలకమైన విషయాన్ని కూడా ట్రంప్ ట్విట్టర్ ద్వారా ప్రకటించడం గమనార్హం.

తమ దేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యే వస్తువులపై ఆయా దేశాలు భారీగా పన్ను వేస్తున్నా.. అమెరికా మాత్రం వాటి వస్తువులపై ఎలాంటి పన్ను వేయడం లేదని కొన్నాళ్లుగా ఆయన చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇండియాపైనా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా తాను అనుకున్నది చేసేశారు ట్రంప్.

 అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా...

అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా...

స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం భారీగా సుంకం విధించింది. చైనా, యూరోప్, పొరుగు దేశం కెనడా లాంటి ప్రధాన వాణిజ్య భాగస్వాముల స్టీల్‌ దిగుమతులపై భారీ సుంకం విధించనున్నామని ట్రంప్ గురువారమే ప్రకటించారు. ప్రధానంగా చైనాలాంటి దేశాల నుంచి గతకొన్ని దశాబ్దాలుగా అమెరికా స్టీల్‌ అల్యూమినియం కంపెనీలు అగౌరవానికి గురయ్యారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అందుకే దేశరక్షణ కోసం గొప్ప గొప్ప స్టీల్ మేకర్స్, అల్యూమినియం మేకర్స్ తయారు కావాలన్నారు. అమెరికాలో ఉక్కు , అల్యూమినియం పరిశ్రమలను పునర్నిర్మించాలని ట్రంప్‌ పేర్కొన్నారు.

 తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ప్రపంచ దేశాలు...

తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ప్రపంచ దేశాలు...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. హఠాత్తుగా స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించడం, పైగా ఇంత కీలకమైన విషయాన్ని కూడా జస్ట్ ట్విట్టర్ ద్వారా ట్రంప్ ప్రకటించడం అందరినీ నివ్వెరపరిచింది. దీనిపై ఇప్పటికే కెనడా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, చైనా, మెక్సికో తీవ్రంగా స్పందించాయి. తాము కూడా దీనిని తిప్పికొట్టే చర్యలు తీసుకుంటామని ఆ దేశాలు స్పష్టం చేశాయి.

 మండిపడుతున్న కెనడా...

మండిపడుతున్న కెనడా...

అమెరికాకు అతి పెద్ద స్టీల్ ఎగుమతిదారు అయిన కెనడా దీనిపై స్పందిస్తూ.. దీనిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అటు యురోపియన్ యూనియన్ తరఫున యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ స్పందిస్తూ.. ఇది యురోపియన్ దేశాల్లోని వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసే చర్య అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలను చూస్తూ కూర్చోబోమని, తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.

 చైనా అధికారికంగా స్పందించకపోయినా...

చైనా అధికారికంగా స్పందించకపోయినా...

అమెరికా దేశాధ్యక్షుడి నిర్ణయంపై చైనా అధికారికంగా స్పందించకపోయినా.. ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. అన్ని దేశాలు అమెరికా పద్ధతిని పాటిస్తే.. అది నిస్సందేహంగా అంతర్జాతీయ వాణిజ్య క్రమంలో తీవ్రప్రభావాన్ని చూపిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్‌ యింగ్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. చైనా ఐరన్ అండ్ స్టీల్ అసోసియేషన్ వైస్-సెక్రటరీ జనరల్ లి జిన్‌ చాంగ్‌ మాట్లాడుతూ, చైనాపై ప్రభావం పెద్దగా ఉండదన్నారు.

 తిప్పికొట్టే యోచనలో ఇతర దేశాలు...

తిప్పికొట్టే యోచనలో ఇతర దేశాలు...

అటు బ్రెజిల్, ఆస్ట్రేలియా, జర్మనీ కూడా ఇలాంటి చర్యలకే సిద్ధమవుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశంలోని కొన్ని వర్గాలు కూడా తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది అమెరికా పౌరుల ఉద్యోగాలకు ఏమాత్రం రక్షణ కల్పించకపోగా.. ధరలు పెరిగి వారిపై మరింత భారం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.

 భారత్‌కు తక్షణ ప్రమాదమేమీ ఉండదు...

భారత్‌కు తక్షణ ప్రమాదమేమీ ఉండదు...

స్టీల్‌ దిగుమతులపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. అయితే తక్షణమే తమ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఉక్కు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అమెరికాకు మన ఎగుమతులు కేవలం 2 శాతం మాత్రమేననీ, ప్రస్తుతానికి వాటిపై ఎలాంటి భారం పడదని ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ్‌ శర్మ కూడా చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
United States President Donald Trump announced on Thursday (March 1) that he would impose hefty tariffs on imported steel and aluminium to protect US producers, risking retaliation from major trade partners such as China, Europe and neighbouring Canada, as well as helping to trigger a large sell-off on Wall Street. Mr Trump said the duties of 25 per cent on steel and 10 per cent on aluminium would be formally announced next week although White House officials later said some details still needed to be ironed out. Mr Trump believes the tariffs will safeguard American jobs but many economists say the impact of price increases for consumers of steel and aluminium, such as the auto and oil industries, will be to destroy more jobs than they create. “We’re going to build our steel industry back and our aluminium industry back,” Mr Trump said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more