వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా: యూఎన్, మిత్రదేశాల దేశాల ఆందోళన

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే, ట్రంప్ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితితోపాటు అమెరికా మిత్రదేశాలు విచారం వ్యక్తంచేశాయి. ఐరోపా, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా దేశాలు ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా దీనిపై ఆందోళన వ్యక్తంచేశాయి.

తాము ట్రంప్‌ నిర్ణయం పట్ల ఆందోళన చెందుతున్నామని మంగలవారం బ్రిటన్‌ ప్రధాని థెరీసా మే, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మెక్రాన్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

మిత్రదేశాలు కోరినా..

మిత్రదేశాలు కోరినా..

ఇరాన్‌తో అణు ఒప్పందం కొనసాగించాలని మిత్ర దేశాలు చెప్పినప్పటికీ ట్రంప్‌ ఈ సంచలన ప్రకటన చేయడం గమనార్హం. వారి దేశాల సంయుక్త భద్రతకు సంబంధించి ఈ ఇరాన్‌ ఒప్పందం ఎంతో ముఖ్యమైనదని, ఈ ఒప్పందానికి అంతా కట్టుబడి ఉండాలని అందరినీ అడిగామని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరామని తెలిపారు.

ఒబామా ఒప్పందం చేసుకుంటే..

ఒబామా ఒప్పందం చేసుకుంటే..

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఆరు దేశాలు రెండేళ్లపాటు చర్చించి ఈ ఒప్పందాన్ని చేశారు. ఇందులో భద్రతామండలిలోని శాశ్వత సభ్యదేశాలైన చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికాతోపాటు జర్మనీ కూడా పాలుపంచుకున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానంతో దీన్ని అంతర్జాతీయ చట్టంగా మార్చారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ఒబామా లెగసీ ముగిసినట్లయింది.

పారదర్శకంగా ఉండాలి..

పారదర్శకంగా ఉండాలి..

అమెరికా ఇరాన్‌ ఒప్పందం నుంచి వైదొలిగే అంశంపై మిత్ర దేశాలను సంప్రదించిందని అధ్యక్షుడు ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్ తెలిపారు. ట్రంప్‌ ప్రకటనకు ముందే యూరోపియన్‌ సహా ఇతర మిత్రదేశాలను ఈ విషయంపై ఇప్పటికే సంప్రదించామని, దీనిపై పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నామని బోల్టన్‌ ‌ వైట్‌హౌస్‌లో మీడియాకు తెలిపారు. మంగళవారం ట్రంప్‌ పలువురు నేతలకు ఫోన్‌ చేసి మాట్లాడారని, ఇంకా చేస్తారని చెప్పారు.

వ్యతిరేకించిన రష్యా

వ్యతిరేకించిన రష్యా

అంతేగాక, బుధవారం బ్రిటిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో తాను చర్చిస్తానని బోల్టన్‌ తెలిపారు. కాగా, ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం పట్ల రష్యా, సిరియా కూడా వ్యతిరేకత వ్యక్తంచేశాయి. ట్రంప్‌ నిర్ణయం పట్ల చాలా నిరాశ చెందామని రష్యా విదేశాంగ మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సౌదీ స్వాగతం.. యూఎన్ ఆందోళన

సౌదీ స్వాగతం.. యూఎన్ ఆందోళన

అయితే, ఇరాన్‌కు శత్రుదేశమైన సౌదీ అరేబియా మాత్రం డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించింది. ట్రంప్‌ నిర్ణయానికి ‘మద్దతిస్తున్నామని, స్వాగతిస్తున్నాం' అని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి వెల్లడించారు. అలాగే గల్ఫ్‌లో సౌదీ మిత్రపక్షాలైన యూఏఈ, బహ్రెయిన్‌ కూడా ట్రంప్‌ నిర్ణయానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. కాగా, ఐక్యరాజ్యసమితి అధిపతి అంటోనియో గుటేరాస్.. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ నిర్ణయం ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.

English summary
United States President Donald Trump on Tuesday announced that the US will withdraw from an international nuclear deal with Iran which was signed in 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X