• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెళ్ళే ముందు మరో బాంబ్ పేల్చిన ట్రంప్ ..మార్చి 31 వరకు గ్రీన్ కార్డులు, వర్కింగ్ వీసాల జారీపై నిషేధం పొడిగింపు

|

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు . మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పదవి నుండి వైదొలగనున్న డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండియన్స్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. యూఎస్ అధ్యక్షుడిగా వెళ్ళిపోయే ముందు ట్రంప్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల పరంపరలోనే అమెరికాలో ఉన్న ఇతర దేశాల సిటిజన్స్ కు శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డులు, ఉద్యోగ, ఉపాధి ఆధారిత వీసాల జారీపై గతంలో విధించిన నిషేధాన్ని పొడిగిస్తూ డోనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు .

  Amid China Tensions, Govt May Blacklist Some Telecom Vendors to 'Enhance National Security'
  మార్చి 31వ తేదీ వరకు ఇమిగ్రేషన్ , వర్కింగ్ వీసాల జారీపై నిషేధం విధించిన ట్రంప్

  మార్చి 31వ తేదీ వరకు ఇమిగ్రేషన్ , వర్కింగ్ వీసాల జారీపై నిషేధం విధించిన ట్రంప్

  మార్చి 31వ తేదీ వరకు గ్రీన్ కార్డులు, వర్కింగ్, ఉపాధి ఆధారిత వీసాల జారీపై నిషేధాన్ని పొడిగించారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న యూఎస్ ఆర్థిక పరిస్థితిని కాపాడడం కోసం, యూఎస్ ఉద్యోగులను రక్షించడం కోసం ఇది అవసరమైన చర్య అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించి తమ పౌరులను వెనక్కి రప్పించడానికి నిరాకరిస్తున్న దేశాలపై విధించిన వీసా ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ గత ఏడాది ఏప్రిల్ నుండి నిషేధం విధించిన విషయం తెలిసిందే.

  ట్రంప్ ఆంక్షలపై జో బిడెన్ ఫైర్ .. ప్రెసిడెంట్ గా బాధ్యతల అనంతరం ఆంక్షలు ఎత్తేస్తారా ?

  ట్రంప్ ఆంక్షలపై జో బిడెన్ ఫైర్ .. ప్రెసిడెంట్ గా బాధ్యతల అనంతరం ఆంక్షలు ఎత్తేస్తారా ?

  ట్రంప్ విధించిన నిషేధం గడువు డిసెంబరు 31, 2020 తో ముగియవలసి ఉండగా ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో మార్చి 31వరకు నిషేధం పొడిగించబడింది. జనవరి 20 న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ఈ ఆంక్షలను విమర్శించారు. కాని ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే వాటిని తొలగిస్తారా లేదా అనేది మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ట్రంప్ నిషేధాలను జారీ చేసినప్పటికీ, జో బిడెన్ ఈ ఆంక్షలను ఉపసంహరించుకోవాలి అనుకుంటే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధ్యక్ష హోదాలో ఉపసంహరించుకోవచ్చు.

  యూఎస్ ఉద్యోగులకు రక్షణ కోసమే నిర్ణయం అన్న ట్రంప్ .. తాజా నిర్ణయంపై కోర్టులో అప్పీల్

  యూఎస్ ఉద్యోగులకు రక్షణ కోసమే నిర్ణయం అన్న ట్రంప్ .. తాజా నిర్ణయంపై కోర్టులో అప్పీల్

  అయితే వెంటనే ఉపసంహరించుకోవడానికి వీలులేని విధంగా ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. యుఎస్ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడంతో యునైటెడ్ స్టేట్స్ లో కనీసం 20 మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారారు. వారి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ట్రంప్ . అక్టోబరులో, కాలిఫోర్నియాలోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ట్రంప్ విదేశీ ఉద్యోగ వీసాల నిషేధంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాల వల్ల కోలుకోలేని హాని కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక తాజా నిర్ణయం పై యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 9 వ యు.ఎస్. సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కు అప్పీల్ చేసింది, ఈ నిర్ణయంపై జనవరి 19 న వాదనలు విననుంది.

  English summary
  U.S. President Donald Trump on Thursday extended a pair of immigration bans that block many "green card" applicants and temporary foreign workers from entering the country, measures he says are needed to protect U.S. workers amid the pandemic-battered economy.The bans, which were issued in April and June, were set to expire on Dec. 31, but will be extended until March 31, 2021, the latest in a series of last-gasp immigration moves by the outgoing Trump administration.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X