వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12న భేటీ: సింగపూర్ చేరుకున్న ట్రంప్, అంతకుముందే కాలుపెట్టిన కిమ్

|
Google Oneindia TeluguNews

సింగపూర్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌తో భేటీ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సింగపూర్‌కు చేరుకున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ఆదివారం సాయంత్రం పాయలెబర్‌ వైమానిక స్థావరంలో అడుగుపెట్టారు. సింగపూర్‌ విదేశాంగశాఖా మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు.

కిమ్‌తో భేటీపై ఎలా భావిస్తున్నారని ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన 'వెరీగుడ్‌' అని ముక్తసరిగా సమాధానమిచ్చి తన లిమోసిన్‌ వాహనం ఎక్కి వెళ్లిపోయారు. ట్రంప్‌ సెంట్రల్‌ సింగపూర్‌లోని ఓ హోటల్‌లో బసచేయునున్నారు.

Donald Trump arrives in Singapore for Kim meet.

ట్రంప్ జూన్‌ 12న కిమ్‌తో భేటీ కానున్నారు. వీరిద్దరు ఉత్తరకొరియా అణు అంశాలపై చర్చించనున్నారు. ట్రంప్‌ రాకకు కొన్ని గంటల ముందే కిమ్‌ ప్రత్యేక విమానంలో సింగపూర్‌ చేరుకున్నారు. ఆయన కూడా ట్రంప్‌ వలే లిమోసిన్‌ వాహనశ్రేణినే ఉపయోగించడం విశేషం. కిమ్‌కు కూడా సింగపూర్ సాదర స్వాగతం పలికింది.

కాగా, ఇప్పటికే కిమ్‌ సింగపూర్‌ ప్రధానితో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఇది ఇలావుంటే, కిమ్‌తో చర్చల సమయంలో ఏదైనా తేడా వస్తే మాత్రం తాను సమావేశాన్ని అర్ధంతరంగానైనా ముగించేస్తానని ట్రంప్ ఇప్పటికే వ్యాఖ్యానించడం గమనార్హం.

English summary
US President Donald Trump touched down in Singapore on Sunday ahead of a historic summit with North Korea's leader Kim Jong Un at which Pyongyang's nuclear arsenal will top the agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X