వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ మద్దతు హిల్లరీకే, నా కంటే ఎక్కువ ఖర్చు: ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డెముక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే ఫేస్‌బుక్ మద్దతిచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డెముక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే ఫేస్‌బుక్ మద్దతిచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా.. ఆ ఎన్నికలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌పై రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. అయితే ట్రంప్‌ గెలుపులో ఫేస్‌బుక్‌ కీలక పాత్ర పోషించిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన ట్రంప్‌.. ఫేస్‌బుక్‌ మద్దతు తనకు లేదని.. హిల్లరీకే ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. 'అధ్యక్ష ఎన్నికల కోసం నా కంటే హిల్లరీ మిలియన్‌ డాలర్లు ఎక్కువ ఖర్చు పెట్టారు. అంతేకాదు.. ఫేస్‌బుక్‌ మద్దతిచ్చింది కూడా నాకు కాదు, హిల్లరీకే' అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

Donald Trump attacks Hillary Clinton and 'fake news' amid probe into Russian-bought Facebook ads

ఎన్నికల సమయంలో ట్రంప్‌ ప్రచారానికి డిజిటల్‌ డైరెక్టర్‌గా ఉన్న బ్రాడ్‌ పార్‌స్కేల్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ విజయం వెనుక ఫేస్‌బుక్‌, ట్విటర్‌ పాత్ర ఉందని ఆయన తెలిపారు.

ఇందులో వచ్చిన పోస్టులు ఎన్నికలపై ప్రభావాన్ని చూపాయన్నారు. మరోవైపు రష్యాకు చెందిన కొందరు హ్యాకర్లు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లను ఉపయోగించిఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ స్పందించారు. ఫేస్‌బుక్‌ కంటే ఎక్కువగా సీఎన్‌ఎన్‌, ఏబీసీ, ఎన్‌బీసీ లాంటి మీడియాల్లో కూడా హిల్లరీకి అనుకూలంగా వార్తలు వచ్చాయని అన్నారు.

English summary
President Donald Trump on Saturday downplayed the significance of Russian-bought Facebook ads, which leading lawmakers investigating election meddling have said were intended to influence last year's campaign and divide Americans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X