వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Trump Impeachment : ట్రంప్‌ అభిశంసన- అమెరికాలో చరిత్రలోనే దారుణ పరాభవం

|
Google Oneindia TeluguNews

అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకూ అగ్రరాజ్యాధినేతగా ప్రపంచదేశాల మన్ననలు అందుకున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల తర్వాత చేసిన చర్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు భవనం క్యాపిటల్‌పై తమ మద్దతుదారులను హింసకు ప్రేరేపించడం ద్వారా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణమైన అప్రతిష్ట మూటగట్టుకున్న ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసనతో ఇంటికి సాగనంపింది.

ఏ క్యాపిటల్ భవనంపై అయితే తన మద్దతుదారులతో ట్రంప్ దాడి చేయించారో అదే భవనంలో సమావేశమైన అమెరికా సర్వప్రతినిధుల సభ 232-197 ఓట్ల తేడాతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడంతో ట్రంప్ పదవీచ్యుతుడయ్యారు. భారీ భద్రత మధ్య క్యాపిటల్‌ భవనంలో సమావేశమై ప్రతినిధుల సభ తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రంప్‌కు అవమానకరమైన ఉద్వాసన తప్పలేదు. జనవరి 13న సమావేశమైన ప్రతినిధుల సభ మెరుపువేగంతో ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది.

Donald Trump becomes first U.S. President to be impeached twice

జనవరి 20న జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం వరకూ ట్రంప్‌పై ఎలాంటి చర్యలు లేకుండా వదిలేస్తే దేశానికి అతి పెద్ద ముప్పు పొంచి ఉంటుందని సర్వప్రతినిధుల సభలో ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్లకు చెందిన 10 మంది డెమోక్రాట్లతో కలిసి ప్రవేశపెట్టిన తీర్మానంలో పేర్కొన్నారు.

ట్రంప్‌ తాజాగా అభిశంసనకు గురికావడంతో అమెరికా చరిత్రలో ఓ అధ్యక్షుడు తన పదవీకాలంలో రెండుసార్లు అభిశంసనకు గురికావడం కూడా ఇదే తొలిసారిగా నిలిచింది. ట్రంప్ 2019లో ఉక్రెయిన్‌తో డీల్‌ విషయంలో తొలిసారి అభిశంసనకు గురయ్యారు. కానీ అప్పటి పరిస్దితుల్లో ఆయన బయటపడ్డారు. కానీ ఈసారి క్యాపిటల్‌ భవనంపై దాడితో వారం రోజుల పదవీకాలం ఉన్నా అవమానకర నిష్కృమణ తప్పలేదు.

English summary
President Donald Trump was impeached by the U.S. House for a historic second time on January 13, charged with “incitement of insurrection” over the deadly mob siege of the Capitol in a swift and stunning collapse of his final days in office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X