వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందువులకు అభిమానిని, మోడీ చాలా గ్రేట్: డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రిపబ్లికన్ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, తాను భారత దేశానికి, హిందూ మతానికి పెద్ద అభిమానిని అని చెప్పారు. ట్రంప్ అమెరికాలోని భారతీయ, హిందూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తనను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే భారత్, అమెరికాల మధ్య మరింత మంచి సంబంధాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ హిందూ కూటమి ఏర్పాటు చేసిన ఇండియన్ - అమెరికన్స్ చారిటీ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

భారత్ అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామగా అభివర్ణించారు. ఇరు దేశాలకూ అద్భుత భవిష్యత్ ఉందన్నారు. తన చేతులకు పరిపాలన బాధ్యతలు వస్తే, ఇరు దేశాలూ మరింత దగ్గరవుతాయన్నారు. భారత దేశంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ చక్కగా పని చేస్తున్నారని ప్రశంసించారు.

donald trump

భారత నేతలు చాలా ఉత్సాహంతో పని చేస్తున్నారన్నారు. తాను హిందువులకు, భారత దేశానికి పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చారు. మోడీ పైన తనకెంతో నమ్మకం ఉందన్నారు. మోడీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. పందొమ్మిది నెలల క్రితం తాను భారత్ వెళ్లానని, ఇకపై కూడా ఎన్నోసార్లు వెళ్లాలని ఉందన్నారు.

ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. ముంబై దాడులను ట్రంప్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు అయిదువేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. తాను గెలిస్తే హిందువులు, భారతీయులు శ్వేత సౌధానికి మంచి మిత్రులుగా మారటం ఖాయమని చెప్పారు. అమెరికాలోని హిందువులంతా తనకు మద్దతు పలికి టెర్రరిజానికి చరమగీతం పాడాలన్నారు.

English summary
Donald Trump calls Narendra Modi a great man, promises close relationship with India if elected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X