వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ట్రంప్‌, ఇవాంకా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. శ్వేతసౌధంలోని ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌.. భారత అమెరికన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సభ్యులతో కలిసి దీపాలను వెలిగిం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. శ్వేతసౌధంలోని ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌.. భారత అమెరికన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించిన ఆయన అధికారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

ఈ వేడుకల్లో ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ, సెంటర్‌ ఫర్‌ మెడికేర్‌ అడ్మినిస్ట్రేటర్‌ సీమా వర్మ, యూఎస్‌ ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అజిత్‌ పాయ్‌ తదితర భారత అమెరికన్లు పాల్గొన్నారు.

Donald Trump celebrates Diwali in White House's Oval Office along with Ivanka, Nikki Haley

ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన వీడియోను ట్రంప్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. భారత-అమెరికన్‌ కమ్యూనిటీతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉన్నట్లు చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన గొప్ప ప్రజలు భారతీయులని, ఆ దేశ ప్రధాని మోడీతో ఉన్న బలమైన సంబంధాలకు తాను చాలా విలువిస్తున్నానని, మన భారత-అమెరికన్‌ సోదరులు, మిత్రులు అమెరికా ఉన్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ట్రంప్ అన్నారు.

అమెరికాలోని సైన్యంలో పనిచేస్తున్న భారత పౌరులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీపుల్స్‌ హౌస్‌లో దీపావళి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ.. అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికీ, హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు.

మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ తొలిసారిగా శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. అయితే ఆయన స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొనలేదు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా స్వయంగా సంబరాల్లో పాల్గొని దీపాలను వెలిగించారు.

English summary
US president Donald Trump celebrated Diwali in Oval Office of the White House along with senior Indian-American members of his administration, including Nikki Haley, Seema Verma and community leaders. Cabinet ranking Haley is US Ambassador to the UN and Seema Verma is administrator of Centers for Medicare and Medicaid Services.Ajit Pai, chairman of the US Federal Communications Commission and Raj Shah, his principle deputy press secretary, were among those who also attended the event from his administration. Daughter Ivanka Trump also joined the president in the Diwali celebrations.in 2016, Ivanka, who is now a presidential advisor, had visited Hindu temples in Virginia and Florida as part of Diwali.Trump, then as the Republican presidential nominee, had addressed the Indian-American community from a public meeting in New Jersey wherein he lit the traditional diya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X