వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబోయ్ మళ్లీనా.. ఆ అవార్డు నాకొద్దు: ట్రంప్, మీకై మీరే అనుకుంటే ఎలా?: ‘టైమ్’

డిసెంబర్‌లో టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పేరును ప్రకటించనుంది. అయితే ఇందుకు ఎవరిని ఎన్నుకుందో ఆ మ్యాగజైన్‌ చెప్పలేదు గానీ.. ఇంటర్వ్యూ, ఫొటో షూట్‌ కావాలని ట్రంప్‌ను కోరింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ గతేడాది 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా తననే 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా ప్రకటించే అవకాశముందని.. అయితే ఆ గౌరవం తనకు వద్దని ట్వీట్ చేశారు ట్రంప్‌.

ఈమేరకు ఆయన ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌లో టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పేరును ప్రకటించనుంది. అయితే ఇందుకు ఎవరిని ఎన్నుకుందో ఆ మ్యాగజైన్‌ చెప్పలేదు గానీ.. ఇంటర్వ్యూ, ఫొటో షూట్‌ కావాలని ట్రంప్‌ను కోరింది.

Donald Trump claims Time Magazine told him he was 'probably' going to be Man of the Year, but he rejected it

దీంతో మళ్లీ తననే పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నుకుంటున్నారని భావించిన ట్రంప్‌.. ఆ అవార్డు తనకు వద్దని చెప్పారు. 'గతేడాదిలాగే ఈసారి కూడా టైమ్‌ మ్యాగజైన్‌ నన్నే పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది. నన్ను ఇంటర్వ్యూ, ఫొటోషూట్‌ కూడా అడిగారు. అయితే ఇందుకు నేను వద్దని చెప్పాను. ఎనీవే.. థాంక్యూ..!' అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌‌పై టైమ్‌ మ్యాగజైన్‌ కూడా స్పందించింది. అధ్యక్షుడు పొరబాటు పడుతున్నారని పేర్కొంది. 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా మేం ఎంపిక చేస్తామని ట్రంప్ పొరబాటు పడుతున్నారు. మా ఎంపికను ప్రకటించేంతవరకు టైమ్స్‌ దాని గురించి మాట్లాడబోదు. డిసెంబర్‌ 6న ఎవరికిచ్చేదీ ప్రకటిస్తాం..' అని రీట్వీట్‌ చేసింది.

English summary
Donald Trump has claimed Time Magazine called him to say he was "probably" going to be their "Man of the Year", but that he turned it down because "probably" wasn't good enough. "Time Magazine called to say that I was PROBABLY going to be named 'Man (Person) of the Year' like last year, but I would have to agree to an interview and a major photo shoot,' the President tweeted. "I said probably is no good and took a pass. Thanks anyway!" Time, however, disputed this statement. "The President is incorrect about how we choose Person of the Year," a tweet from the magazine's account said. "TIME does not comment on our choice until publication, which is December 6."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X