వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయులకు షాక్: కరోనా కాలంలో డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం. యూఎస్‌కూ నష్టమే!

|
Google Oneindia TeluguNews

వాషంగ్టన్: కరోనా మహమ్మారి అమెరికాలో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ అగ్రరాజ్యంలో లక్ష మందికిపైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. బారీ ప్రాణ నష్టం కలిగించడంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది ఈ మహమ్మారి.

Recommended Video

AP CM YS Jagan Writes Letter To Union External Affairs Minister || Oneindia Telugu
వీసాల నిలిపివేత?

వీసాల నిలిపివేత?

ఈ క్రమంలో అమెరికాలో నిరుద్యోగం రికార్డుస్థాయిలో పెరిగిపోయింది. దీంతో తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల ఉద్యోగ, ఉపాధి వీసాలను కొంతకాలంపాటు నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ దేశ మీడియా కథనాలు వెల్లడించాయి.

భారతీయులకు షాకే

భారతీయులకు షాకే

ఈ ప్రభావం అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయులపైనే ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలా మంది వృత్తిపరమైన నిపుణులకు ఇచ్చే వలసేతర వీసా హెచ్1బీ పైనే ఉంటున్నారు. అయితే, ట్రంప్ నిలిపివేయాలనుకుంటున్న ఉద్యోగ వీసాల్లో ఇది కూడా ఉన్నట్లు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్' పేర్కొంది. అయితే, ఆది అమెరికా వెలుపల ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్నవారిపై తాజా నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. ఒక వేళ ట్రంప్ తాజా నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లయితే.. మనదేశం నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడాలని కలలు కంటున్నవారికి చుక్కెదురైనట్లే.

ఇండియాకు వచ్చిన వారికీ కష్టమే..

ఇండియాకు వచ్చిన వారికీ కష్టమే..

కరోనా సంక్షోభంలో చాలా మంది హెచ్1బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోయి ఇండియాకు తిరిగివచ్చారు. తాజా నిర్ణయం అమలైతే వీరు కూడా తిరిగి అమెరికా వెళ్లాలనుకున్నా కొంతకాలంపాటు వేచిచూడక తప్పదని తెలుస్తోంది. అయితే, తాజా నిర్ణయం అమలుపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శ్వేతభవనం వెల్లడించింది.

అమెరికాకే నష్టమంటూ..

అమెరికాకే నష్టమంటూ..

అమెరికా పౌరుల ఉపాధిని రక్షించేందుకు నిపుణులు అనేక మార్గాలు సూచించారని, వాటన్నింటినీ పరిశీలిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి హోగలన్ గిడ్లే తెలిపారు. కాగా, హెచ్1బీ తోపాటు హెచ్2బీ, జే1, ఎల్1 వీసాలు కూడా నిలిపివేయాలనుకుంటున్న జాబితాలో ఉన్నట్లు తెలిసింది. తాజా నిర్ణయాలపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ డోనో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ నిపుణుల అవసరం ఇప్పుడు అమెరికాకు చాలా ఉందని, ఇలాంటి తరుణంలో వారిని నిరోధించే చర్యలు చేపట్టడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు అంతమంచిది కాదని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఆర్థిక నిపుణులు కూడా ట్రంప్ నిర్ణయం సరికాదంటున్నారు.

English summary
US President Donald Trump is considering suspending a number of employment visas including the H-1B, most sought-after among Indian IT professionals, in view of the massive unemployment in America due to the coronavirus pandemic, according to a media report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X