వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా అమెరికాను రేప్ చేయడమేంటో..! ట్రంప్ సంచలన కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

వివాదస్పద వ్యాఖ్యలతో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి తన నోటికి పనిచెప్పారు. అయితే ఈమధ్య కాలంలో ఎప్పుడు సంధు దొరికినా ఇండియానే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తోన్న ట్రంప్ ఈ దఫా చైనాను టార్గెట్ చేశారు.

చైనా వాణిజ్యం అమెరికాకి ముప్పుగా పరిణమించిందని వ్యాఖ్యానించిన ఆయన.. అంతర్జాతీయ మార్కెట్ లో తమ ఉత్పతులకు ఉన్న డిమాండ్ ను మరింత పెంచుకోవడానికి చైనా వాణిజ్య అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం గురించి మాట్లాడుతూ.. నేనుండగా అమెరికాను చైనా రేప్ చేయటానికి అసలేమాత్రం అవకాశం ఇవ్వనంటూ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు.

donald trump controversial comments on china

త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరిలో నిలిచేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న ట్రంప్, ఇండియానాలోని ఫోర్ట్ వేన్ నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ తరహా వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాగా.. చైనా మీద తనకెలాంటి కోపం లేదని చెప్పిన ట్రంప్, తమ నేతల అసమర్థత కారణంగానే అమెరికాలో చైనా ఎగుమతులు పెరిగాయని ఆరోపించారు. చివరగా, చైనాతో పోల్చి చూస్తే అమెరికా చాలా శక్తివంతమైన దేశమన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు ట్రంప్.

English summary
american republic party candidate donald trump again slipped his tongue over chinas bussiness in america
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X