వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ ఏ పరిస్థితిలో ఉన్నాడో నాకు తెలుసు..! త్వరలో మీకూ తెలుస్తుంది..! ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఉత్తర కొరియా అద్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఉన్నాడా..? పోయాడా..? అనే అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్ ప్రాణాలతో ఉన్నాడా లేడా అనే విషయాన్ని ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నట అమెరికి స్పష్టం చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నార్త్ కొరియా అద్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

Recommended Video

Kim Jong Un : Donald Trump Have A Very Good Idea About Kim Jong Un's, But Can't Talk
కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై ఉత్కంఠ.. నిజాలు వెళ్లడించాలంటూ ట్రంప్ పై ఒత్తిడి..

కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై ఉత్కంఠ.. నిజాలు వెళ్లడించాలంటూ ట్రంప్ పై ఒత్తిడి..

కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ దేశాల ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తుంది ఉత్తర కొరియా అద్యక్షుడి ఆరోగ్యం గురించేననే అంశం స్పష్టమవుతోంది. ఇంతకీ ఉత్తర కొరియా అద్యక్షుడు ప్రాణాలతో ఉన్నారా..? లేరా..? అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏవేవో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. త్వరలో అన్ని తెలుకుంటారంటున్న ట్రంప్..

ఏవేవో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. త్వరలో అన్ని తెలుకుంటారంటున్న ట్రంప్..

అంతే కాకుండా కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని, ఇదే సమాచారం త్వరలో ప్రపంచానికి తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసారు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. అయితే ఈ విషయంపై మాట్లాడలేనని చెప్పారు. అతిస్వల్ప సమయంలోనే అన్ని విషయాలు బహిర్గతమవుతాయని ట్రంప్ వెళ్లడించారు.

కిమ్ ఆరోగ్యంగా ఉండాలి.. అంతకన్నా ఎక్కువ కోరుకోనన్న యూఎస్ ప్రసిడెంట్..

కిమ్ ఆరోగ్యంగా ఉండాలి.. అంతకన్నా ఎక్కువ కోరుకోనన్న యూఎస్ ప్రసిడెంట్..

అంతే కాకుండా కిమ్ బావుండాలని మాత్రమే కోరుకుంటున్నట్లు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సోమవారం రాత్రి మాట్లాడిన ట్రంప్.. కిమ్‌తో నాకు బలమైన సంబంధాలు ఉన్నాయని వెళ్లడించారు. కిమ్‌ ఆరోగ్యంగా ఉన్నాడని అనుకుంటున్నానని, ఆయన పరిస్థితి ఎలా ఉందో తనకు తెలుసని, కానీ ప్రస్తుత పరిస్ధితులు బావోగ్వాదంతో కూడికుని ఉన్న తరుణంలో తాను చెప్పలేనని ట్రంప్ తెలిపారు. త్వరలోనే ప్రపంచ దేశాలకు నార్త్ కొరియా విషయాలన్నీ తెలుస్తాయి అని చెప్పారు. అంతేకాదు తాను దేశాధ్యక్షుడుని కాకపోయి ఉండి ఉంటే ఈ సమయానికి నార్త్ కొరియాతో యుద్ధం చేయాల్సి వచ్చి ఉండి ఉండేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలుస్తుంది.. సంయమనంగా ఉంగడాలన్న డోనాల్డ్ ట్రంప్..

కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలుస్తుంది.. సంయమనంగా ఉంగడాలన్న డోనాల్డ్ ట్రంప్..

కాగా ఈ మద్యనే ఏప్రిల్15న కిమ్‌ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ 108వ జయంతి కార్యక్రమానికి కిమ్ జాంగ్ ఉన్ హాజరుకాలేదు. దీంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు కిమ్ ఆరోగ్యం క్షీణించిందని, కిమ్ కోసం చైనా నుంచి ఓ ప్రత్యేక బృందం ఉత్తర కొరియాకు వెళ్లిందని, ఇలా పలు పుకార్లు వినిపించాయి. అయితే ఆ వార్తలన్నీ నార్త్‌ కొరియా ఖండించింది. వర్కర్స్‌కు కిమ్‌ శుభాకాంక్షలు తెలిపినట్లు ఉత్తర కొరియా మీడియా అధికారింగా తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అద్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

English summary
US President Donald Trump has made sensational comments about Kim Jong Un's health, saying he will be informed about the situation soon.US President Donald Trump's comments on North Korean President Kim Jong Un's health have been sensational.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X