వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రావెల్ బ్యాన్ సవరణ ఆర్డర్ పై ట్రంప్ సంతకం రేపే, ఆ దేశాలకు ముప్పు తప్పినట్టేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నారని తెలుస్తోంది.నెలరోజుల పాటు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను అమెరికా తీసుకురానుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్ఢర్ పై సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది.

దాదాపు నెలరోజుల తర్వాత కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయనున్నారు.

అమెరికాలో దాదాపుగా నెలరోజుల పాటు అత్యవసర పరిస్థితిని సృష్టించిన ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తం కావడం, ఫెడర్ కోర్టు మొట్టికాయలు వేయడంతో కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకురావాలని నిర్ణయం తీసుకొన్నారు.

donald trump

తన నిర్ణయం అమల్లో వెనక్కి తగ్గని ఆయన అదే ఆదేశాల్లో పలు మార్పులు చేస్తూ మరోసారి అమలు చేసేందుకు సిద్దమయ్యారని అమెరికా మీడియా చెబుతోంది.

అయితే ఈ దఫా న్యాయస్థానం కూడ అడ్డుచెప్పలేని విధంగా నిబంధనలను సిద్దం చేశారంట.వాస్తవానికి గత వారంలోనే దీనిపై సంతకం చేయాలని ట్రంప్ భావించినా ఆచితూచి ముందుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే మరింత లోతుగా పరిశీలించి కొత్త కార్యనిర్వాహక ఆదేశాలను అమలు చేయనున్నారు.

అంతర్గత భద్రతా వ్యవహరాల శాఖ నిర్వహణ కార్యాలయంలో ట్రంప్ ఈ సంతకం చేస్తారని సమాచారం. ఈ మేరకు అమెరికా మీడియా ఈ విషయాన్ని ప్రసారం చేసింది. అయితే కొత్త ఆర్డర్ లో పాత పద్దతిలోనే నిబంధనలు ఉంటాయా లేదా అనే విషయం బయటకు రాలేదు.

English summary
President Donald Trump is expected to sign a revised travel ban tomorrow, just over a month after his original decree sowed controversy across the United States and chaos at airports, US media reported.The president will sign the new executive order at the department of homeland security, according to Politico, which cited senior government officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X