వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్క్ ఎస్పెర్‌పై డొనాల్డ్ ట్రంప్ నిప్పులు: ట్విట్టర్ వేదికగా విమర్శలు, తొలగిస్తున్నామంటూ..

|
Google Oneindia TeluguNews

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమో ఏమో తెలియదు కానీ.. తన సహచర మంత్రులపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్నారు. రక్షణశాఖ మంత్రి మార్క్ ఎస్పెర్‌పై ట్వీట్‌లో ఫైరయ్యారు. ఎస్పెర్ స్థానంలో క్రిస్టోఫర్ సీ మిల్లర్ నియమితులు కానున్నారు. అతను ప్రస్తుతం జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

క్రిస్టోఫర్ సీ మిల్లర్‌‌ను ట్రంప్ కొనియడారు. జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్ర డైరెక్టర్‌గా సెనెట్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. క్రిస్టోఫర్ తాత్కాలిక రక్షణశాఖ మంత్రిగా తక్షణమే పదవీ చేపడుతారని అందులో పేర్కొన్నారు. అంతేకాదు క్రిస్ గొప్ప పని చేయబోతున్నారు.. ఎస్పెర్‌ను తొలగిస్తున్నామని చెప్పారు. ఇన్నాళ్లు దేశానికి సేవచేసినందుకు ఎస్పెర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Donald Trump fires Secretary of Defence Mark Esper on Twitter

అయితే ఇదివరకు మార్క్ ఎస్పెర్, విదేశాంగ మంత్రి మైక్ పొంపే భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యూఎస్ ఇండో బేసిక్ ఎక్సైంజ్ అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ (బీఈసీఏ) ఒప్పందం కూడా జరిగింది. అయితే అమెరికా మీడియా మాత్రం జూన్ నుంచి ఎస్పెర్-ట్రంప్ మధ్య దూరం పెరిగిందని అంటోంది. తర్వాత ఆగస్ట్‌లో ఎస్పెర్‌ను ట్రంప్ యెస్పర్ అని కూడా కామెంట్ చేశారు. న్యూస్ కాన్ఫరెన్స్‌లో కామెంట్ చేయడంతో విభేదాలు బయటకు వచ్చాయి. ఎస్పెర్‌ను 2019 జూలైలో రక్షణశాఖ మంత్రిగా నియమించారు. కానీ ఏడాదిలో విభేదాలు చూపాయి. అంతకుముందు జేమ్స్ మాట్యిస్ ఆ పదవీలో కొనసాగారు.

English summary
Donald Trump fired Secretary of Defence Mark Esper in a tweet. Esper will be replaced as Secretary of Defence by Christopher C Miller, Director of the National Counterterrorism Centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X