వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీప్ అమెరికా గ్రేట్ : 2020 ఎన్నికల ప్రచారం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా : అగ్రరాజ్య అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నిక కోసం ప్రచారం ప్రారంభమైంది. 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న ఆయన.. ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో 2016 ఎన్నికల్లో బరిలో దిగిన ట్రంప్ ఈసారి కీప్ అమెరికా గ్రేట్ స్లోగన్‌తో ముందుకొచ్చారు. అమెరికాను గొప్పగా తీర్చి దిద్దేందుకు మరో నాలుగేళ్ల పాటు ఇదే టీమ్‌ను ఎంపిక చేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

Recommended Video

మోదీ తో కలిసి నడుస్తాం : అమెరికా

2017 జనవరిలో అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఆయన.. పాలిటిక్స్‌పై ఉన్న మక్కువతో 73 ఏళ్ల వయసులో అధ్యక్ష బరిలో దిగారు. దేశాధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో చాలా వరకు వివాదాస్పదమయ్యాయి. కొన్ని విషయాల్లో ప్రతిపక్షాలే కాదు.. స్వపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా వాటిని లెక్కచేయకుండా ఆయన ముందుకెళ్తున్నారు.

Donald Trump formally launches 2020 election campaign

మూడేళ్ల క్రితం అమెరికాలో కొత్త అధ్యాయం మొదలైందన్న ట్రంప్ అందులో భాగంగా అమెరికా ఫస్ట్ నినాదాన్ని తూచా తప్పకుండా పాటించామని చెప్పారు. తాను ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని, మరోసారి తనను అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. 2020 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. 2021 జనవరిలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టనున్నారు.

English summary
US President Donald Trump formally launched his 2020 re-election campaign on Tuesday by presenting himself as the same political insurgent who shook up the Washington establishment four years ago and who is now a victim of an attempted ouster by Democrats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X