వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొప్ప గౌరవం: హిల్లరీని ప్రశంసలతో ముంచెత్తిన ట్రంప్

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్‌‌ను ప్రశంసలతో ముంచెత్తారు. హిల్లరీ క్లింటన్‌ తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నందుకు అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌ డెమొక్రాటిక్‌ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌, బిల్‌ క్లింటన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల తర్వాత తొలిసారిగా వీరి మధ్య సుహృద్భావ వాతావరణం ఇక్కడే చోటు చేసుకోవడం గమనార్హం. బిల్‌క్లింటన్‌ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరు కావటాన్ని తాను అత్యంత గౌరవంగా భావిస్తానని తెలిపారు. 'వారితో కలిసి నిలబడేందుకు ఇష్టపడతాను. నిజంగా చెబుతున్నా.. నాకు వారంటే ఎనలేని గౌరవం' అని ట్రంప్‌ అన్నారు.

భారత టెక్కీలకు అమెరికా షాక్: హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినంభారత టెక్కీలకు అమెరికా షాక్: హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినం

'మేమందరం మంచివాళ్లం.. అంతా ఒకటే కోరుకుంటాం..' అని తెలిపారు. ట్రంప్‌ హిల్లరీ గురించి చెప్పేటప్పుడు సమావేశ ప్రాంగణంలోని వారంతా గౌరవ సూచకంగా ఒక్కసారి లేచి నిలబడి కరతాళధ్వనులతో అభివాదం చేశారు.

Donald Trump: Imagine how Hillary Clinton must have felt at the inauguration

అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డెమొక్రాటిక్‌ పార్టీ కీలక నేతలు డుమ్మాకొట్టారు. తొలుత దాదాపు 67మంది డెమొక్రటిక్‌ పార్టీ కాంగ్రెస్‌ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కారని భావించినా తర్వాత ఈ సంఖ్య 60కి తగ్గింది. హిల్లరీ క్లింటన్‌ తన భర్త, మాజీ దేశ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఒక్క జార్జ్‌ హెచ్‌. డబ్ల్యూ బుష్‌ తప్ప ప్రస్తుతం అందుబాటులో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షలు అందరూ హాజరవడం విశేషం. న్యూమోనియాతో బాధపడుతుండటంతో సీనియర్‌ బుష్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్లు తెలిసింది.

English summary
When Donald Trump arrived at the inaugural luncheon following his swearing-in as US President, he immediately shook hands with his election rival Hillary Clinton, who was sitting with members of his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X