వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Trump Impeachment:ట్రంప్‌కు అభిశంసన... ఇంపీచ్‌మెంట్ ప్రక్రియ ఏంటి..?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా మెజార్టీ ఓట్లు పడ్డాయి. ఇక్కడ నుంచి ఆ తీర్మానం సెనేట్‌కు వెళుతుంది. అయితే సెనేట్‌లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్ సభ్యులు మెజార్టీలో ఉన్నందున అక్కడ ట్రంప్‌కు అనుకూలంగానే ఓట్లు వస్తాయని చెప్పొచ్చు. అయితే ట్రంప్‌ పై ఆరోపణలు రుజువైతే పరిస్థితి ఏంటి..? అసలు అభిశంసన తీర్మానం ఏంటి..?

 అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది

అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో అధ్యక్షుడు ట్రంప్‌పై డెమొక్రాట్లు ఇచ్చిన అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో వాడీవేడీ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సందర్భంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా 230 ఓట్లు రాగా అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో మెజార్టీ సభ్యులు డెమొక్రాట్లు ఉన్నందున ట్రంప్ గట్టెక్కలేకపోయాడు.

అయితే సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్లదే హవా ఉన్నందున ట్రంప్‌కు ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ తలెత్తే అవకాశాలు లేవు.ఇదిలా ఉంటే అధ్యక్ష పదవిలో ఉన్న ఒక వ్యక్తిపై ఎలాంటి విచారణ చేపట్టరాదని అమెరికా రాజ్యాంగంలో ఉంది. కానీ అభిశంసన తీర్మానం ద్వారా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని తొలగించవచ్చు అనేది కూడా అదే రాజ్యాంగంలో ఉంది.

 అభిశంసన తీర్మానం ప్రక్రియ ఏంటి..?

అభిశంసన తీర్మానం ప్రక్రియ ఏంటి..?

ఒక అధ్యక్షుడిని తొలగించే ప్రక్రియలో భాగంగా అభిశంసన తీర్మానంను ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే సభలో సాధారణ మెజార్టీ సరిపోతుంది. దీంతో సెనేట్‌లో విచారణ ప్రారంభం అవుతుంది. విచారణ అనంతరం నివేదిక ఆధారంగా తీర్మానంను ప్రవేశపెడతారు. ఇక్కడ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించాలంటే మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం అవుతుంది.

 ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే పరిస్థితేంటి?

ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే పరిస్థితేంటి?

సెనేట్‌లో అత్యధికులు రిపబ్లికన్‌లే ఉన్నారు. ఇక ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోవాలంటే రిపబ్లికన్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తే తప్ప ఇది జరగదు. ఇది అసాధ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే మెజార్టీ రిపబ్లికన్ సభ్యులు ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నవారే.

ఒకరిద్దరు సెనేటర్లు ఇప్పటికే ట్రంప్ సర్కార్‌పై వ్యతిరేక గళం విప్పారు. ప్రజల్లో ట్రంప్ గ్రాఫ్ పడిపోతున్నప్పటికీ... హౌజ్‌లో మాత్రం ఆయనకు కావాల్సినంత మద్దతు ఉంది. అందుకే ట్రంప్ అభిశంసన తీర్మానంలో సులభంగా గట్టెక్కుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 సెనేట్‌లో విచారణ ప్రక్రియ ఇలా ఉంటుంది

సెనేట్‌లో విచారణ ప్రక్రియ ఇలా ఉంటుంది

ఇక సెనేట్‌లో విచారణ ప్రక్రియను అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో జరుగుతుంది. జ్యూరీ సభ్యులుగా సెనేట్ సభ్యులు ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ తరపున ఓ లాయరు వాదనలు వినిపిస్తారు. ఇక విచారణ ముగిసిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది.

సెనేట్‌లో కూడా మూడింట రెండొంతులు మెజార్టీ ట్రంప్‌కు ప్రతికూలంగా వస్తే ఇక అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ను తొలగించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితే ఉత్పన్నమైతే మిగతా కాలానికి అధ్యక్షుడిగా అమెరికా వైస్‌ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపడతారు. 100 మంది సభ్యులున్న సెనేట్‌లో 53 మంది రిపబ్లికన్లు ఉన్నారు. అయితే ట్రంప్ ఓటమికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయనే చెప్పాలి.

మొత్తానికి రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అయితే కాలమే ఇందుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాజకీయాల్లో బళ్లు ఓడలయ్యాయి, ఓడలు బళ్లు అయిన ఘటనలు చాలానే ఉన్నాయన్న సంగతి మరవకూడదు.

English summary
With the US House of Representatives formally charging Donald Trump on two counts of wrongdoing, the 73-year-old has become only the third President in the country’s 243-year history to be impeached.There is a lot of process to be done for a President to be impeached.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X