వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషింగ్టన్‌లో రెండు వారాలు ఎమర్జెన్సీ- ట్రంప్ కీలక నిర్ణయం- బైడెన్‌ ప్రమాణస్వీకారం వేళ

|
Google Oneindia TeluguNews

వరుస ట్విస్ట్‌లతో సాగిపోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తదనంతర పరిణామాల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో ట్విస్ట్‌ ఇచ్చారు. అదీ కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం వేళ కావడం మరో విశేషం. ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్‌ను అధ్యక్షుడిగా గుర్తిస్తూ అమెరికా ఉభయసభలు ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశాన్ని నిరసిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు హింసాత్మక చర్యలకు దిగిన నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

 డొనాల్డ్ ట్రంప్ రాజీనామా?: అభిశంసనకు ముందే: పదవీకాలం ముగిసినట్టు వెల్లడి: ఊహించని ట్విస్టులు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా?: అభిశంసనకు ముందే: పదవీకాలం ముగిసినట్టు వెల్లడి: ఊహించని ట్విస్టులు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. క్యాపిటల్‌ భవనం బయట జరిగే ఈ కార్యక్రమానికి ట్రంప్ మద్దతుదారుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఎఫ్‌బీఐ హెచ్చరికలు చేస్తోంది. ఇప్పటికే ట్రంప్‌ మద్తతుదారుల చర్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వాషింగ్టన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పూర్తిస్ధాయిలో భద్రత కల్పించడం ఇప్పుడు ట్రంప్‌కు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో రాజధానిలో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ ప్రకటిస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

donald trump issues emergency in wake of joe bidens oath ceremony

జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మిగిలి ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రభుత్వం కొలువుదీరేందుకు మరో వారం రోజుల సమయం ఎలాగో పడుతుంది. దీంతో రెండు వారాల పాటు రాజధానిలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ట్రంప్‌ ఎమర్జెన్సీ విధించారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్‌ తాజా నిర్ణయంతో వాషింగ్టన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు అమెరికా హోంల్యాండ్‌ పోలీసులకు అవకాశం కలుగుతుంది.

Recommended Video

BJP Leaders Attacked Pragathi Bhavan, Some Of Them Are Arrested | Oneindia Telugu

English summary
us president donald trump has issued emergency declaration for the nation's capital amid growing concern among local and federal authorities about violence and fbi warnings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X