వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌కు కరోనా- వైట్‌హౌస్‌ను వీడని వైరస్- భయాందోళనలు..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబాన్ని కరోనా ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌, చిన్న కుమారుడు బారన్‌కు కరోనా సోకగా.. వీరంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు. తాజాగా ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్‌ జూనియర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంత వైట్‌హౌస్‌లో తీవ్ర కలకలం రేగుతోంది.

డొనాల్డ్‌ ట్రంప్‌ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చురుగ్గా పనిచేసిన ట్రంప్‌ జూనియర్‌కు వాస్తవానికి కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ర్యాండమ్‌గా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ట్రంప్‌ జూనియర్‌ను క్వారంటైన్‌కు ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. డాన్‌గా పిలిచే ట్రంప్‌ జూనియర్‌కు ఈ వారం మొదట్లోనే పాజిటివ్‌గా తేలిందని, దీంతో తన క్యాబిన్‌కే పరిమితం చేసినట్లు ఆయన అధికార ప్రతినిధి చెప్పారు.

Donald Trump Jr tests positive for COVID-19, quarantined without symptoms

Recommended Video

COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన Pfizer.. క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలు ఇలా!

వైట్‌హౌస్‌లో ట్రంప్‌ కుటుంబానికే కాకుండా వారికి సహాయకులుగా, సలహాదారులుగా ఉంటున్న వారికీ కరోనా వైరస్‌ నిర్ధారణ అవుతోంది. తాజాగా ట్రంప్‌కు న్యాయ సలహాలు అందిస్తున్న పర్సనల్‌ లాయర్‌ రూడీ గ్యులియానీ కుమారుడు ఆండ్రూ గ్యులియానీకి కూడా కరోనా సోకింది. మరోవైపు కరోనా విషయంలో ముందునుంచీ అజాగ్రత్తగా ఉన్న ట్రంప్‌ జూనియర్‌కు కరోనా సోకడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అక్రమాల విషయంలోనూ తన తండ్రి ట్రంప్‌కు ఆయన గట్టి మద్దతుదారుగా ఉంటున్నారు.

English summary
US President Donald Trump's eldest son Donald Trump Jr has tested positive for COVID-19 and is quarantining without symptoms, the latest in a long list of infections among those with links to the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X