వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్, కిమ్ సమావేశం: ఎక్కడో తెలుసా, జూన్‌లో మీటింగ్?

By Narsimha
|
Google Oneindia TeluguNews

సియోల్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే సింగపూర్‌లో సమావేశం కానున్నట్టు ప్రచారం సాగుతోంది. కిమ్ తో సమావేశానికి సంబంధించిన తేది, వేదిక ఖరారైందని ట్రంప్ ఇటీవలనే ప్రకటించారు. దీంతో సింగపూర్‌లోనే వీరిద్దరూ సమావేశమయ్యే అవకాశాలు లేకపోలేదని దక్షిణ కొరియాకు చెందిన మీడియా అభిప్రాయపడుతోంది.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇటీవల కాలంలో దక్షిణ కొరియా అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందే రెండు దేశాలకు చెందిన అధికారులు తమ దేశాల మధ్య నెలకొన్న విబేధాల పరిష్కారం కోసం చర్చలు జరిపారు.

ఈ సమావేశం సందర్భంగానే అమెరికా అధ్యక్షుడితో కూడ తాను చర్చలు జరిపేందుకు కూడ సిద్దమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రకటించారు. ఈ తరుణంలో కిమ్‌తో చర్చలకు తాను కూడ సిద్దమని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు ఇరు దేశాధినేతల మధ్య సమావేశానికి రంగం సిద్దమైంది.

ట్రంప్, కిమ్ చర్చలు సింగపూర్‌లో

ట్రంప్, కిమ్ చర్చలు సింగపూర్‌లో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ల మధ్య చర్చలు సింగపూర్‌లో సమావేశమయ్యే అవకాశం ఉందని దక్షిణ కొరియాకు చెందిన మీడియా అభిప్రాయపడింది. ఈ రెండు దేశాధినేతల మధ్య చర్చలకు రంగం సిద్దమైన తరుణంలో సింగపూర్‌లోనే సమావేశం జరిగే అవకాశం ఉందని ఆ మీడియా సంస్థ అభిప్రాయపడింది. ఇటీవలనే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో కూడ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సమావేశమయ్యారు.

 జూన్‌లో ట్రంప్‌తో కిమ్ సమావేశం

జూన్‌లో ట్రంప్‌తో కిమ్ సమావేశం

2018 జూన్ మాసంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్గ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ల సమావేశం జరిగే అవకాశం లేకపోలేదని దక్షిణ కొరియాకు చెందిన మీడియా సంస్థ అభిప్రాయపడింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు ఈ ఏడాది ఆరంభం నుండి శాంతి మార్గాన్ని అనుసరిస్తున్నారు ఈ ఏడాది ఆరంభంలో కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలు జరపబోమని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.

దక్షిణకొరియా అధినేతతో ట్రంప్ సమావేశం

దక్షిణకొరియా అధినేతతో ట్రంప్ సమావేశం

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మూన్ జే ఇన్‌కు ఆహ్వనం పలికారని దక్షిణ కొరియాకు చెందిన చోసున్ ఇల్పో అనే మీడియా సంస్థ ప్రకటించింది. మే చివరి వారంలో వీరిద్దరి మధ్య సమావేశం జరిగే అవకాశం లేకపోలేదని ఆ సంస్థ ప్రకటించింది.

సింగపూర్‌తో పాటు ఇతర ప్రదేశాల పేర్ల పరిశీలన

సింగపూర్‌తో పాటు ఇతర ప్రదేశాల పేర్ల పరిశీలన

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల సమావేశానికి సింగపూర్‌లో జరిగే అవకాశం లేకపోలేదు అయితే సింగపూర్‌తో పాటు మంగోలియా, స్విట్జర్లాండ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దక్షిణ కొరియా, ఉత్తరకొరియాల అధ్యక్షులు మూన్ జే ఇన్, కిమ్ జంగ్ ఉన్‌లు ఇటీవల సమావేశమైన గ్రామంలో సమావేశం కావాలని కూడ భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాల పేర్లను కూడ పరిశీలిస్తున్నారు.

English summary
The US and North Korean leaders are likely to meet in Singapore in mid-June, according to South Korean media reports, as tensions ease on the Korean peninsula following the first inter-Korean summit in over a decade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X