వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాష్.. ప్లాష్.. ప్లాష్.. కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు ట్రంప్ ఓకే...

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లభించిన కశ్మీర్ సమస్య సాల్వ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్దన్న అమెరికా జోక్యం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్-పాకిస్థాన్ సమస్యకు పరిష్కారమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపినట్టు తెలిసింది.

Donald Trump offers to mediate on Kashmir

భారత్-పాకిస్థాన్ మధ్య పీఠముడి కశ్మీర్. దీని కోసం ఇరుదేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధమే నడుస్తోంది. సమస్యకు పరిష్కార కోసం అగ్రరాజ్యాలు మధ్యవర్తిత్వం వహించాలని ఇప్పటికే పలుసార్లు కోరినా ఫలితం లేదు. కానీ చాన్నాళ్లకు అమెరికా అధినేత ట్రంప్ ముందుకొచ్చారు. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు అంగీకారం తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో ఈ మేరకు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది.

కశ్మీర్ తమదంటే తమదని భారత్, పాకిస్థాన్ కొట్లాడుతున్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది. ఈ అంశం దేశ విభజన జరిగినప్పటి నుంచి కొనసాగుతుంది. అంతేకాదు భారత్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులను కూడా ఉసిపొల్చి పైశాచిక ఆనందాన్ని పొందుతుంది. అయితే దీనిపై అంతర్జాతీయ సమాజంలో భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. ఈ క్రమంలోనే పెద్దన్న అమెరికా ముందుకొచ్చి మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చినట్టు ప్రకటించింది.

English summary
Donald Trump offers to "mediate" on Kashmir between India and Pakistan during meeting with Imran Khan: news agency AFP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X