వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ ఫాలోవర్లు: ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, మోడీ, ప్రపంచ మహిళా నేతల్లో సుష్మానే ఫస్ట్

సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌లకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌లకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది.

మహిళా నేతల్లో ప్రపంచంలోనే సుష్మా మొదటి స్థానంలో నిలవగా, ప్రధాని మోడీ మొత్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఈ మేరకు ట్వప్లోమసీ నివేదిక వెల్లడించింది.

Donald Trump overtakes Pope Francis, Narendra Modi as most followed world leader on Twitter

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న నేతగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్, మూడో స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు.

ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ ఫాలోయర్ల సంఖ్య సుమారు 40 మిలియన్లు. పోప్‌కు 39 మిలియన్లు, మోడీకి 35 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఇండియా ట్విట్టర్ ఖాతా 21 మిలియన్ల మంది ఫాలోయర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. మహిళా నేతల్లో అయితే, భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌లో ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. సుమారు 9.6 మిలియన్ల మంది ఫాలోయర్లతో సుష్మా స్వరాజ్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు.

English summary
US President Donald Trump has pipped Pope Francis and Indian Prime Minister Narendra Modi to become the most followed world leader on micro-blogging site Twitter. With almost 40 million followers under his belt, Trump’s twitter handle has surpassed the pope, who uses nine different language accounts to send the same message in Spanish, English, Italian, Portuguese, Polish, French, Latin, German and Arabic. Pope Francis has over 39.5 million followers at the time Twiplomacy crunched the number.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X