వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

45వ అధ్యక్షుడు: ట్రంప్ గెలిచారిలా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. అయితే, ఎంతో ఉత్కంఠకు గురిచేసిన ఎన్నికలు.. చివరకు ఎవరూ ఊహించని విధంగా ఫలితాలనిచ్చాయి. అన్ని సర్వేలూ డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని చెప్పినప్పటికీ.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు.

ఎగ్జిట్‌ ఫలితాలు ప్రారంభం నుంచి ట్రంప్‌ ఆధిక్యం స్పష్టంగా కనపడింది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం నుంచి ట్రంప్‌ ఆధిక్యం కొనసాగింది. ఓట్ల లెక్కింపుపై అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. మొత్తం 578 ఓట్లకుగాను ట్రంప్‌ 288, హిల్లరి 219 ఓట్లను సాధించారు. దీంతో ఎలక్ట్రోరల్‌ కాలేజీ ఓట్ల మ్యాజిక్‌ సంఖ్య 270ని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు అందుకోవడంతో ట్రంప్‌ విజయం ఖరారైంది. దీంతో రిపబ్లికన్లు డైట్‌కోక్‌లు, కాఫీలు తాగుతూ సంబరాల్లో మునిగిపోగా... హిల్లరీ మద్దతుదారులు విచారవదనాలతో కన్పించారు.

ట్రంప్‌ విజయం ఇలా సాగింది

బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి..

భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం6.30 గంటల సమయానికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లుగా ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. కనెక్టికట్‌, డెలావెర్‌, ఇల్లినాయిస్‌, మేరీలాండ్‌, మసాచుసెట్స్‌, న్యూజెర్సీ, రోడ్‌ ఐలాండ్‌ వెర్మెంట్‌ రాష్ట్రాల్లో హిల్లరీ ఆధిక్యంలో ఉన్నట్టు ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది.

కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మొదట్లో హిల్లరీ ఆధిక్యం సాధించినా అనంతరం ట్రంప్‌ దూసుకొచ్చారు. దీంతో ఎవరు గెలుస్తారన్న అంశంపై మొదట తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలబామా, ఇండియానా, కెంటకీ ఒక్లాహామా, సౌత్‌ కరొలినా, టెన్నిసీ, వర్జీనియా రాష్ట్రాల్లో ట్రంప్‌కు ఆధిక్యం లభించింది.

 Donald Trump

కీలకమైన ఫ్లోరిడా ఫలితం

కీలక రాష్ట్రమైన ఫ్లోరిడా ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇక్కడ ఎవరు సీట్లు సాధిస్తే వారికే విజయం వరించే అవకాశముంది. రాష్ట్రంలో 29 ఎలక్ట్రోరల్‌ ఓట్లు ఉండటం అవి రిపబ్లికన్స్‌కు రావడంతో ట్రంప్‌ ముందంజలో ఉండేందుకు దోహదం చేసింది. కాగా, ఇక్కడ ట్రంప్ 49శాతం ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ హిల్లరీకి 47.7శాతం ఓట్లు లభించాయి.

ఉదయం 9.30గంటలు

ఎన్నికల ఎగ్జిట్‌ ఫలితాలు రావటం ప్రారంభమైన వేళ ట్రంప్‌.. హిల్లరీల మధ్య పోటాపోటీగా ఫలితాలు వెలువడినప్పటికీ.. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటల సమయానికి రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్‌ ఆధిక్యంలోకి వచ్చారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న కొద్ది ట్రంప్‌ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.

కనెక్టికట్‌, డెలావెర్‌, ఇల్లినాయిస్‌, మేరీలాండ్‌, మసాచుసెట్స్‌, న్యూజెర్సీ, రోడ్‌ ఐలాండ్‌ వెర్మెంట్‌ రాష్ట్రాల్లో హిల్లరీ ఆధిక్యంలో ఉన్నట్టు ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మొదట్లో హిల్లరీ ఆధిక్యం సాధించినట్లు కనిపించింది. అనంతరం హిల్లరీ, ట్రంప్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. హిల్లరీ కంటే ట్రంప్‌ ఆధిక్యంలో దూసుకెళ్తున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడయ్యాయి. అంతేగాక, అలబామా, ఇండియానా, కెంటకీ ఒక్లాహామా, సౌత్‌ కరొలినా, టెన్నిసీ, వర్జీనియా రాష్ట్రాల్లో ట్రంప్‌కు ఆధిక్యం లభించింది.

ట్రంప్‌ ఎక్కడా తగ్గలేదు

భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటల సమయంలో ట్రంప్‌ అధిక్యం అంతకంతకూ పెరుగుతూ ఫలితాలు వెలువడుతున్నాయి. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌ కంటే ట్రంప్‌ పలు రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతున్న కొద్దీ ట్రంప్‌ పైచేయి స్పష్టమవుతోంది.

మధ్యాహ్నం 12 గంటలు: కొనసాగిన ట్రంప్ జోరు

మొత్తం 538 స్థానాలకుగాను మెజారిటీ స్థానాల్లో ట్రంప్‌ అధిక్యంలో సాగుతున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్‌ 244 చోట్ల అధిక్యంలో ఉండగా.. హిల్లరీ క్లింటన్‌ 215 చోట్ల ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌ అంచనాలు మొదలైనప్పటి నుంచి హిల్లరీ కంటే అధిక్యంలో ఉన్న ట్రంప్‌ అంతకంతకూ తన అధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

45వ అమెరికన్ అధ్యక్షుడిగా ట్రంప్

భారత కాలమానం ప్రకారం సుమారు మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ట్రంప్‌ విజయానికి దాదాపుగా ఖరారైంది. దీంతో ట్రంప్‌ మద్దతుదారుల్లో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి. అదే సమయంలో ఈ ఫలితాన్ని ఏమాత్రం ఊహించని డెమోక్రాట్లు షాక్‌కు గురయ్యారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో హిల్లరీ శిబిరంలో నిరాశ అలుముకుంది.

కాగా, మధ్యాహ్నం ఒంటి గంట దాటాక విజయానికి అవసరమైన 270 మ్యాజిక్‌ ఫిగర్‌ను రిపబ్లికన్లు దాటేశారు.దీంతో అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ తెరమీదకొచ్చారు. మొదటి నుంచి హోరాహోరీ పోటీ జరుగుతుందని అనుకున్నప్పటికీ.. హిల్లరీనే విజయం సాధిస్తారని సర్వేలతోపాటు అనేక దేశాలు అనుకున్నాయి. కానీ, ఎవరూ ఊహించని విధంగా ట్రంప్ విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

కాగా, ఫలితాలు వెలువడగానే ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాను నూతనంగా నిర్మిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమకు 2వ స్థానం తెలియదని, తామెప్పుడూ అగ్రరాజ్యమేనని శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.

English summary
Donald Trump won the US presidential election early this morning in a stunning victory that sent shockwaves around the world. The Republican took the key swing states of Florida, North Carolina and Ohio early this morning, as he marched towards the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X