వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి తప్పులో కాలేసిన డొనాల్డ్ ట్రంప్: జో బిడెన్‌పై ట్వీట్ రివర్స్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తన ప్రత్యర్థి జో బిడెన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. అయితే, ట్రంప్ చేస్తున్న విమర్శలు తిరిగి ఆయనకే తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా ఓ ఫేక్ వీడియో పోస్టు చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న ఓ పాటను జో బిడెన్ ప్లే చేస్తున్నట్లు ఉన్న వీడియోను డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే, ఆ వీడియోను 'మానిప్యులేటెడ్ మీడియా'గా ట్విట్టర్ మార్క్ చేసింది. కాగా, ఆ వీడియోలో పోడియం వద్ద బిడెన్ నిల్చుని సెల్ ఫోన్ తీసుకుని.. నాకు చెప్పడానికి ఒక విషయం మాత్రమే ఉంది అని ప్రేక్షకులకు తెలిపారు

ఆ తర్వాత అతను ఎన్.డబ్ల్యూ.ఏకు చెందిన 1988 నిరసన పాట 'ఫక్ ది పోలీస్' ప్లే చేస్తూ.. చిరునవ్వుతూ డ్యాన్స్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది. కొన్ని సెకన్ల తరువాత, అతను ఇలా చమత్కరించాడు: "ఈ వ్యక్తులలో ఎవరికైనా ప్రతిభ ఉంటే, నేను అవుతాను.. ప్రశంసల ద్వారా నేను అధ్యక్షుడిగా ఎన్నుకోబడతాను." అని.

 Donald Trump Posts Fake Video of Joe Biden Playing Anti-police Song, Twitter Marks it as Manipulated Media

"చైనా దూసుకుపోతోంది" అని ఈ రీట్వీట్ పై ట్రంప్ రాశాడు. అయితే, బిడెన్ ఎప్పుడూ కూడా ఎన్.డబ్ల్యూ.ఏకు చెందిన ఆ పాటను ప్లే చేయలేదు. మంగళవారం బిడెన్ ఫ్లోరిడాలో నిర్వహించిన ప్రచారం నుంచి ఈ వీడియో క్లిప్‌ను తీసుకున్నారు. దాన్నే మానిప్యులేట్ చేశారు.

కాగా, ఫ్లోరిడాలో బిడెన్ తన ఫోన్‌ను తీసుకుని 'డెస్పాసిటో'ను కొద్ది సెకండ్లపాటు ప్లే చేశారు. లాటిన్ హిట్స్ సింగర్ లూయీ ఫోన్సీ.. బిడెన్‌ను ఈ కార్యక్రమంలో పరిచయం చేశారు. కాగా, ఇక్కడి వీడియోను తీసుకుని ఎడిట్ చేసిన ఓ మానిప్యులేటెడ్ వీడియోను ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రత్యర్థుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచీ జో బిడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. 77 ఏళ్ల జో బిడెన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ట్రంప్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. జో బిడెన్ ఎన్నికల్లో ఓటమి పాలవుతారని.. ఒక మానసిక రోగిని అమెరికా అధ్యక్షుడిగా ప్రజలు చూడలేరని అన్నారు.

డెమోక్రాట్ల నుంచి కూడా విమర్శలు అదే స్థాయిలో వస్తుండటంతో ట్రంప్ మరింత రెచ్చిపోతున్నారు. రష్యా, చైనాలు తన ఓటమిని కోరుకుంటున్నాయని, జో బిడెన్ కోసం ఈ రెండు దేశాలు కుట్రలు చేసే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాను గెలవకుంటే అమెరికా ప్రతిష్ట దిగజారుతుందని చెబుతున్నారు. వివాదాస్పదమైన ట్వీట్లను చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు ట్రంప్.

English summary
Donald Trump Posts Fake Video of Joe Biden Playing Anti-police Song, Twitter Marks it as 'Manipulated Media'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X