వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి: డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా దేశంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని అన్నారు.

అంతేగాక, పోస్టల్ బ్యాలెట్‌తో ఎన్నికలు జరిగితే అవకతవకలు జరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితి నుంచి బయటపడి.. ప్రజలంతా క్షేమంగా బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొనే వరకూ ఎన్నికలు వాయిదా వేయడం మించిదని ట్రంప్ అన్నారు.

Donald Trump raises possibility of delaying November US presidential election

ఒకవేళ మెయిల్-ఇన్-ఓటింగ్ చేపడితే 2020 ఎన్నికలు తప్పుడు, మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, మెయిల్-ఇన్-ఓటింగ్ ప్రక్రియను డొనాల్డ్ ట్రంప్ మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. నవంబర్‌లో జరగబోయే ఎన్నికలను రద్దు చేసేందుకు లేదా వాయిదా వేసేందుకు ట్రంప్ మొగ్గుచూపుతారని ఇప్పటికే డెమోక్రాట్‌లు చెప్పాయి.

అమెరికా జీడీపీ భారీగా క్షీణించినట్లు వార్తలు వచ్చిన కాసేపటికే ట్రంప్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. అయితే, అమెరికా ఎన్నికల తేదీని మార్చే అధికారం అధ్యక్షుడికి లేదు. ఈ మేరకు అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. 1845 నుంచీ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3నే జరుగుతుండటం గమనార్హం.

ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా స్పష్టంగా నిర్దేశించింది.
అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన నాలుగేళ్ల తర్వాత వచ్చే నవంబరులో తొలి సోమవారం తర్వాతి మంగళవారం నాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికలు జరగాలి అని రాజ్యంగం చెబుతోంది.

English summary
President Donald Trump is for the first time floating a “delay” to November's presidential election, as he makes unsubstantiated allegations that increased mail-in voting will result in fraud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X