వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళనకరంగానే డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం: వైట్‌హౌస్, వైద్యులు మాత్రం మరోలా!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరోనా బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైట్‌హౌస్ చీఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ వెల్లడించారు. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని చెప్పారు. ట్రంప్‌నకు కరోనా సోకిన తర్వాత 24 గంటలపాటు ముఖ్యమైన అవయవాలు కలవరపెట్టినట్లు తెలిపారు.

నిలకడగానే అంటున్న ఆస్పత్రి వర్గాలు

నిలకడగానే అంటున్న ఆస్పత్రి వర్గాలు

కాగా, ఆస్పత్రి వర్గాలు మాత్రం ట్రంప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నాయని వెల్లడించాయి. ట్రంప్ ఆస్పత్రిలో చేరిన తర్వాత గుండె, మూత్రపిండాలు, కాలేయం పరితీరు మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని తెలిపాయి. అయితే, జ్వరం గానీ, శ్వాస ఇబ్బందులు కానీ లేవని వైద్యులు వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్‌నకు తొలుత వైట్‌హౌస్‌లోనే మొదట చికిత్స అందించినా తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో వాల్డర్ రీడ్ సైనిక ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రి నుంచే విధులు.. అదే సమస్య

ఆస్పత్రి నుంచే విధులు.. అదే సమస్య

ట్రంప్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయం చెప్పలేమని, రెండ్రోజుల పరిశీలన తర్వాతే ఏదైనా చెప్పగలమని అన్నారు. ఇది ఇలావుంటే, ఆస్పత్రిలోని అధ్యక్ష కార్యాలయం నుంచే ట్రంప్ కొన్నాళ్లపాటు విధులు నిర్వర్తిస్తారని వైట్ హౌస్ తెలిపింది. 74ఏళ్ల డొనాల్డ్ ట్రంప్.. స్థూలకాయం, కొలెస్టరాల్ ఎక్కువగా ఉండటం వంటివి ఆయనకు చికిత్స విషయంలో కలవరపెట్టే అంశాలుగా మారాయన్నారు.

ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్రంప్..

ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్రంప్..

కాగా, తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. రెమిడిసివర్ తోపాటు ప్రయోగాత్మక యాంటీబాడీ ఔషధాలను ట్రంప్‌నకు ఇస్తున్నారు. అమెరికా మొదటి మహిళ మెలానియాకు స్వల్పంగా దగ్గు, తలనొప్పి ఉన్నట్లు తెలిపాయి.

అత్యధిక కేసులు అమెరికాలోనే..

అత్యధిక కేసులు అమెరికాలోనే..

అమెరికాలో ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులున్న విషయం తెలిసిందే. అమెరికాలో తాజాగా, 12,407 కొత్త కేసులు నమోదు కాగా, 117 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,614,184కు చేరుకుంది. 214,394 మంది కరోనా బారినపడి మరణించారు.

English summary
US President Donald Trump's condition after testing positive for coronavirus on Friday was far worse than what officials had made public, as per White House Chief of Staff Mark Meadows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X