• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్ సృష్టి: సాక్ష్యాలున్నాయ్..కళ్లారా చూశా: డొనాల్డ్ ట్రంప్

|

న్యూయార్క్: భయానక కరోనా వైరస్ జనం ప్రాణాలను తీయడమే కాదు.. అగ్ర రాజ్యాల మధ్య చిచ్చు పెడుతోంది. ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉంటూ వస్తున్నాయని అనుమానిస్తోన్న మనస్పర్థలు, భేదాభిప్రాయాలు.. కరోనా వైరస్ సృష్టించిన అలజడి వల్ల ఒక్కసారిగా భగ్గుమనే స్థితికి చేరుకుంటున్నాయి. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ఈ విభేధాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బేస్ పాయింట్‌గా మారినట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్‌ను చైనా కృత్రిమంగా సృష్టించి ఉండొచ్చంటూ ఇప్పటిదాకా అమెరికాలో వ్యక్తమౌతోన్న అనుమానాలను మరింత బలం కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.

  Coronavirus Created By Chaina In Wuhan Labs - Donald Trump | Oneindia Telugu
   వుహాన్ ల్యాబొరేటరీతో లింకు

  వుహాన్ ల్యాబొరేటరీతో లింకు

  వుహాన్‌లోని ల్యాబొరేటరీతో కరోనా వైరస్‌కు సంబంధం ఉందని, దీన్ని అక్కడే తయారు చేశారనడానికి అవసరమై సాక్ష్యాధారాలను తాను చూశానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వుహాన్‌ ఇన్‌స్ట్యిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కరోనా వైరస్‌ను సృష్టించారంటూ అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం అనుమానాలను వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అవి ఎలాంటి ఆధారాలంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. సమయం వచ్చినప్పుడు బయట పెడతానని స్పష్టం చేశారు.

   వైరస్ ఎలా పుట్టుకొచ్చిందో సమగ్ర నివేదిక..

  వైరస్ ఎలా పుట్టుకొచ్చిందో సమగ్ర నివేదిక..

  వుహాన్‌లోని హ్యునన్ ఫిష్ మార్కెట్‌లో కరోనా వైరస్ జన్మించినట్లు చైనా మాటల్లో ప్రకటించిందే తప్ప.. దానిపై ఎలాంటి నివేదికను రూపొందించకపోవడం తమ అనుమానాలను బలపరుస్తోందని ట్రంప్ అన్నారు. వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై సమగ్ర నివేదికను అందజేయాలని కోరుతున్నామని చెప్పారు. నిజానికి- ఈ పనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేయాల్సి ఉందని అన్నారు. చైనాతో డబ్ల్యూహెచ్ఓ కుమ్మక్కు కావడం వల్లే ఎలాంటి నివేదికను కోరట్లేదని విమర్శించారు.

  చైనాతో కుమ్మక్కు..

  చైనాతో కుమ్మక్కు..

  కరోనా వైరస్‌కు జన్మనిచ్చిన చైనాపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తోందంటూ కొద్దిరోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై విరుచుకు పడుతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అలాంటి ఫైర్ బ్రాండ్ వైఖరిని ప్రదర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాతో చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా పుట్టుకకు కారణమైన చైనాతో కుమ్మక్కు అయిందని నిప్పులు చెరిగారు. డబ్ల్యూహెచ్ఓ చర్యలు సిగ్గుచేటు అని విమర్శించారు.

  ప్రపంచ ఆరోగ్య సంస్థ వివాదాస్పద నిర్ణయాలు..

  ప్రపంచ ఆరోగ్య సంస్థ వివాదాస్పద నిర్ణయాలు..

  అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం ఆయన వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ పుట్టినిల్లుగా పేరు తెచ్చుకున్న వుహాన్ సిటీ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా ఒక్క నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేకపోతోందని నిలదీశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకునే నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా ఉన్నాయని, అవన్నీ చైనా వైపు మొగ్గు చూపేలా ఉన్నాయని ఆరోపించారు. కరోనా వైరస్ వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో తయారు చేసినట్లు నివేదికలు ఉన్నప్పటికీ.. వాటిపై డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తు చేపట్టకపోవడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు.

  English summary
  US President Donald Trump on Thursday threatened China with fresh tariffs as he stepped up his attacks on Beijing over the coronavirus crisis, saying he had seen evidence linking a Wuhan lab to the contagion. The diatribe from the Republican incumbent came as data showed the United States shed more than 30 million jobs in six weeks, as lockdown measures began to bite across the nation. The gloom in the world's largest economy found its parallel across the Atlantic, where experts warned of an unprecedented financial catastrophe in Europe.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X